మన తెలుగు లో కొన్ని కొన్ని సినిమాలు సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అందులో ప్రధానంగా అల్లు అర్జున్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు మాస్ ని చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా  వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే మాస్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతను చేసిన మూడో సినిమా ఇది. మూడు సినిమాలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఈ సినిమా కథకు మంచి పట్టు ఉండటం తో సినిమాను చాలా మంది వీక్షించారు. 

 

ఈ సినిమాలో ప్రతీ ఒక్కటి కూడా హైలెట్ అయింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో పాటలు అయితే అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయ్యాయి అనే  మాట వాస్తవం. ప్రతీ పాట కూడా చాలా బాగా జనాలను ఆకట్టుకుంది. చాలా మంది ఈ సినిమాలో పాటలకు టిక్ టాక్ లు కూడా చేసారు. అందులో ఆస్ట్రేలియా అతగాడు డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ అనే పాట  చాలా చాలా హిట్ అయింది. ఆ పాట లో ప్రధానంగా డాన్స్ చాలా బాగా హిట్ అయింది అనే మాట వాస్తవం. ఆ పాట ను చాలా మంది సోషల్ మీడియాలో వీక్షించారు. 

 

ఏ పాట కూడా ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో హిట్ అవ్వలేదు అనే చెప్పాలి.  ఆ పాట మేకింగ్ కూడా ఒక రేంజ్ లో హిట్ అయింది అని చెప్తారు. ఇక ఆ పాట ను యుట్యూబ్ లో చాలా  మంది వీక్షించారు. ఆ పాటను ఇప్పటి వరకు 26 కోట్ల మంది చూసారు అందులో.

మరింత సమాచారం తెలుసుకోండి: