ముందుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ సోదరుడి కుమారుడైన రామ్, ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. అనంతరం వచ్చిన సినిమాల్లో కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు రామ్ కెరీర్ లో బెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

IHG's 'Crazy Feeling' - IndustryHit.Com

అయితే విజయాలతో సంబంధం లేకుండా రామ్ నటించే సినిమాల్లో సాంగ్స్ మాత్రం ఎప్పుడూ శ్రోతలను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ తో కలిసి రామ్ నటించిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఆ సినిమాలోని సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, అలరించే సాంగ్స్ తో పాటు ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అందించారు. మరీ ముఖ్యంగా సినిమాలోని క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్ అయితే యువతను విపరీతంగా ఊపేసింది. 

 

తాను ప్రేమించిన అమ్మాయి అందం ముందు వేరెవ్వరూ సరిపోరు అంటూ సరదాగా హీరో ఆలపించే ఈ సాంగ్, విజువల్ గా కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. రామ్, కీర్తి జంట ఈ సాంగ్ లో ఎంతో అదిరిపోయింది. ఇక ఈ సాంగ్ వీడియో యూట్యూబ్ లో 113 మిలియన్ల వ్యూస్ తో ఇప్పటికీ మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. అలానే ఈ సాంగ్ ఇప్పటికీ కూడా అక్కడక్కడా పలు ఫంక్షన్స్ లో తరచూ వినపబడుతూనే ఉంటుంది అంటే దీని క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: