యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. గత ఏడాది మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకుని సూపర్ హిట్ కొట్టింది. అంతకముందు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రామ్, పూరి జగన్నాథ్ లకు ఈ సినిమా విజయంతో మంచి బ్రేక్ లభించింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. 

IHG's 'iSmart Shankar' song promo ...

రామ్ మార్క్ మాస్ స్టైల్, పెర్ఫార్మన్స్ కు పూరి మార్క్ డైలాగ్స్, మ్యానరిజమ్స్ తోడవడంతో ఈ సినిమాని అటు యువతతో పాటు ఇటు మాస్ ఆడియన్స్ కూడా విశేషంగా ఆదరించడం జరిగింది. యువ భామలు నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్, అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిజంగా ఎంతో అదిరిపోయింది. సినిమాలోని పాటలు అన్ని కూడా ఎంతో అదరణపొందగా, మరీ ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సాంగ్ అయితే మరింతగా సక్సెస్ సాధించింది.  

 

ఎవ్వరినీ లెక్కచేయను, తనకు తానే ఒక ఉస్తాద్ ని అంటూ హీరో తన మార్క్ స్టైల్ లో ఆలపించే ఈ సాంగ్ కు మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి. ఆడియోతో పాటు విజువల్ గా కూడా ఎంతో హిట్ అయిన ఈ సాంగ్ వీడియోకు ప్రస్తుతం యూట్యూబ్ లో 108 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఆ విధంగా యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకెళ్తున్న ఈ సాంగ్, ఇప్పటికీ కూడా అక్కడక్కడా పలు ఫంక్షన్స్ లో వినపడుతూనే ఉంటుంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: