పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు దగ్గర పడుతుండటంతో అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టారు. సోమవారం నుంచే సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పవన్‌కు అడ్వాన్స్‌ బర్త్‌ డే విషెష్‌ ట్యాగ్ సోషల్  మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో  పవన్ మాజీ స్నేహితుడు, స్టార్ కమెడియన్‌, వైఎస్సార్‌ సీపీ నేత అలీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు.

 

సినిమాల్లో పవన్‌, అలీలు చాలా గొప్ప స్నేహితులు. పవన్‌ ప్రతీ సినిమాలోనూ అలీ కనిపించేవాడు. అంతేకాదు కొన్ని సినిమా వేడుకల్లో స్టేజ్‌ మీద మాట్లాడేటప్పుడు పక్కన అలీ ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ కూడా కామెంట్ చేశాడు పవన్‌. అయితే ఇంత మంది స్నేహితుల మధ్య గత ఎన్నికలు చిచ్చుపెట్టాయి. పవన్‌ ఆలోచనలకు వ్యతిరేకంగా అలీ వైఎస్సార్‌ సీపీ పార్టీలో చేరటం తీవ్ర చర్చరీయాంశం అయ్యింది.

 

ఆ సమయంలో పవన్‌, అలీల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీంతో పవన్‌ అభిమానులు అలీ మీద గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అలీ, పవన్ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. `వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్` అంటూ ట్వీట్ చేశాడు.

 

అయితే ట్వీట్‌తో పవన్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు అలీ. రాజకీయాల్లో పవన్‌కు వెన్నుపోటు పొడిచావటం ఫైర్‌ అవుతున్నారు అభిమానులు. `నువ్వు ఒక మనిషి రూపంలో ఉన్న మానవ సర్పానివి మిస్టర్ అలీ. ఎందుకంటే నీ రాజకీయ సొంత ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారిని వెన్ను పోటు పొడి చావు. అది తెలియక నీకు తన స్నేహితుడీ స్థానం ఇచ్చాడు. కానీ నువ్వు పాలు పోసిన విషం కక్కే గుణం కలిగి సర్పానివి` అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పవన్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: