దివగంత హీరోయిన్, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించిన రెండో సినిమా.. గుంజన్ సక్సేనా థియేటర్ విడుదల స్కిప్ చేసి  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. ఇందుకోసం నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ 70కోట్ల వరకు చెల్లించిందని టాక్. ఇక ఈసినిమా విడుదలకు డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం.
 
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంజన్ సక్సేనా స్ట్రీమింగ్ లోకి రానుంది. భారత మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో జాన్వీ, గుంజన్ పాత్రలో కనిపించనుంది. జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈచిత్రాన్ని శరన్ శర్మ తెరకెక్కించాడు.   
 
ఇక బాలీవుడ్ లో ఈసినిమా కాకుండా రానున్న మూడు నెలలో అరడజనకు పైగా సినిమాలు  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయి అందులో భాగంగా ఈనెల 24న  దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచార ,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలకానుండగా సుశాంత్ గౌరవార్ధం ఈసినిమా ను డిస్నీ,ఫ్రీ గా స్ట్రీమింగ్ లో ఉంచనుంది. ఇక విద్యాబాలన్ నటించిన శంకుతలా దేవి, ఈనెల 31న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. ఇవి కాకుండా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి బాంబ్, అజయ్ దేవగణ్ నటించిన బుర్జ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అలాగే సడక్ 2, ది బిగ్ బుల్ ,ఖుదాఫీజ్ ,లూట్ కేస్ చిత్రాలు త్వరలోనే  డైరెక్ట్ గా డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: