టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `నేను శైలజ`. ఈ చిత్రం ద్వారానే కీర్తి సురేష్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది.  స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. న్యూయ‌ర్ కానుక‌గా 2016 జ‌న‌వ‌రి 1న విడుద‌ల అయిన ఈచిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. చాలా రోజులు రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్ రూట్ మార్చి తెరకెక్కించిన సినిమా నేను శైలజ. 

IHG

ఈ చిత్రంలో సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో రామ్ ప్రేక్ష‌కులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అమ్మాయిని ప్రేమించే అబ్బాయి.. అబ్బాయిని ప్రేమించినా కానీ తండ్రి దగ్గర లాక్‌ అయిపోయే అమ్మాయి. పెళ్లి సెటిల్‌ అయిందని తెలిసి అమ్మాయింటికి అబ్బాయి వెళ్లి ఆ పెళ్లి అయ్యేలోగా ఆమె కుటుంబాన్ని మెప్పించి, తన ప్రేమకథని సుఖాంతం చేసుకోవడంమే నేను `శైల‌జ సినిమా`.  రొటీన్ క‌థే అయినా.. ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించి హిట్ అందుకున్నాడు. మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ కీర్తి మంచి న‌ట‌న క‌న‌బ‌రిచి.. ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది.

IHG

ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించారు. అందులో ముఖ్యంగా `ఏం చెప్పను? నిన్నెలా ఆపను? ఓ ప్రాణమా నిన్నెలా వదలను? ఏ ప్రశ్నను ఎవరినేమడగను? ఓ మౌనమా నిన్నెలా దాటను?` అంటూ సాగే సాంగ్‌తో రామ్‌, కీర్తి యూట్యూబ్‌ను షేక్ చేశార‌నే చెప్పాలి. అప్ప‌ట్లో ఈ సాగే సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మ‌రియు చాలా రోజుల పాటు ఈ పాట యూత్ ఫెవరెట్ సాంగ్ గా మారిపోయింది. ఈ పాట‌లో రామ్‌, కీర్తి ప్రద‌ర్శించిన హావ‌భావాలు ప్రేక్షకులను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే `ఏం చెప్ప‌ను` సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 120 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: