క‌రోనా వైర‌స్‌.. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. కంటికి క‌నిపించ‌కుండానే.. ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేసి.. ప్ర‌జ‌లంద‌రినీ నానా ఇబ్బందుల‌కు గురుచేస్తోంది. యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల జరుగుతోందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇటీవ‌ల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కుటుంబంలో బచ్చన్ ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డడంతో.. అన్ని చిత్ర ప‌రిశ్ర‌మలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి.

 

వాస్త‌వానికి  మొదటి నుంచి అంటే కరోనా టైమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిగ్ బి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. స్టార్స్ అందరూ కలిసి ఎవరింట్లో వారు ఉండి ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తూ వ‌చ్చిన బిగ్‌బీకు క‌రోనా సోక‌డంతో.. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు చాలా మదనపడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమితాబ్, అభిషేక్ నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా.. ఐష్‌, ఆరాధ్యలకు ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం వ‌ల్ల‌ ఇంట్లోనే చికిత్సనందిస్తున్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కు కరోనా చికిత్స పెద్ద‌గా అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 

 

ఎందుకంటే.. బిగ్‌బీకు చాలా తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని, తక్కువ మోతాదులో మందులు ఇస్తున్నామని తెలిపిన వైద్యులు.. ట్రీట్ మెంట్ కంటే అబ్జర్వేషన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.  అలాగే అటు అభిషేక్ కు  జ్వరం కూడా లేదని.. ఈయ‌న‌కు ఇంకా తక్కువ మోతాదులో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఇక మరో ఐదు రోజుల పాటు వీళ్లిద్దర్నీ అబ్జర్వేషన్ లో ఉంచి, ఆ తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికీ పాజిటివ్ వస్తే చికిత్సకు సంబంధించి డోస్ పెంచుతామని.. నెగెటివ్ వస్తే అదే చికిత్సను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తామని వైద్యులు వెల్ల‌డించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: