బాలీవుడ్ పరిశ్రమ 2020లో కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. వేల కోట్ల నష్టాలు రావటంతో పాటు పలువురు లెజెండరీ ఆర్టిస్ట్‌లను సైతం కోల్పోయింది ఇండస్ట్రీ. ఎంతో మంది సీనియర్‌ నటులను, యంగ్ హీరోలను కూడా కోల్పోయింది బాలీవుడ్. ముఖ్యంగా ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం బాలీవుడ్‌ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్‌ కీర్తిని ఇంటర్‌నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లిన ఇర్ఫాన్ ఖాన్‌ ఈ ఇయర్‌ ఏప్రిల్ 29న కోకిల్ బెన్‌ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

 

ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం తరువాత ఆయన తనయుడు సోషల్  మీడియాలో యాక్టి.వ్ అయ్యాడు. ఇర్ఫాన్ వారసుడు బాబిల్‌, తండ్రితో తన అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. ఇప్పుడు మరోసారి తన తండ్రిని తలుచుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్  చేశాడు బాబిల్‌. తన భావాలతో పాటు కొన్ని ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్‌ చేశాడు బాబిల్‌. ఈ సందర్భంగా తాను తండ్రి బాటలో నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా హింట్ ఇచ్చాడు.

 

సుదీర్ఘ కాలం పాటు అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడి మృతి చెందాడు ఇర్ఫాన్‌ ఖాన్‌. లండన్‌లో చాలా రోజులు పాటు చికిత్స పొందిన ఈ లెజెండరీ స్టార్‌, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు తెలియజేస్తూ వచ్చాడు. చాలా కాలం తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన ఇర్ఫాన్‌ సీరియస్‌ కావటంతో మృతి చెందాడు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

5 years too much, And now you’re a stranger 5 years in love, Pickin straws out the haystack Flicking through the picket pages Of the books I never read through. And that’s just one half of it The other half is you, Gleaming through the wicked winter moon, I wish I could fit in your shoes. You have gone so far away. And I’m always just a little too late. Plucking the strings of my sitar to soothe, These monday morning blues And I carried on like the wayward son, In the wayward sun, but I found myself roaming the wastelands. I was high, when I witnessed my mother cry. I might never win. For, never will forget me, the unforgivable sin. Blood on her lips, crippled my heart. Pierced my soul like an adamant dart. Ma, my ma, tell me you love me too. Ma, my ma, I would give it all for you. (Yo bro, u know I love you more than life itself. ) @sikdarsutapa

A post shared by Babil Khan (@babil.i.k) on

మరింత సమాచారం తెలుసుకోండి: