ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు చాలా వరకు హీరోయిన్ లకు స్టార్ అనే ఇమేజ్ వచ్చేస్తుంది. వాళ్ళ వాళ్ళ సినిమాలు ఎక్కువగా చూస్తే చాలు ఇక వాళ్ళు స్టార్ హీరోయిన్ లు అనే విధంగా వాళ్ళు కలరింగ్ ఇవ్వడం అనేది మనం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా చూస్తున్నాం. ఇక వాళ్ళ సినిమాల్లో వాళ్ళ పాత్రలు కూడా ఇప్పుడు చాలా వరకు హిట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అనే చెప్పాలి. హీరోల పక్కన తమ పాత్ర హిట్ అయింది అంటే చాలు ఎంత పడితే అంత డిమాండ్ చేస్తున్నారు. 

 

ఇప్పుడు అందుకే ఎక్కువగా డిమాండ్ చేసే బాలీవుడ్ హీరోయిన్ ల విషయంలో టాలీవుడ్ ఒక నిర్ణయానికి వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. అవును ఎక్కువగా ఎవరు అయితే డిమాండ్ చేస్తున్నారో వారిని పక్కన పెట్టాలి అని బాలీవుడ్ హీరోయిన్ ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ లు ఇక్కడ సినిమా చెయ్యాలి అని భావిస్తే వారు సినిమాలకు సంబంధించి ప్రచార బాధ్యతలను కూడా తీసుకోవాలి అని టాలీవుడ్ లో చాలా వరకు కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది అని అంటున్నారు. 

 

ఏ స్టార్ హీరోయిన్ అయినా సరే అదే విధంగా ఆలోచించాలి. ఇప్పుడు  తెలుగు లో సినిమా అనగానే గతంలో మాదిరిగా  కోట్లకు కోట్లు ఇచ్చేసి సినిమాలు చేయించుకునే వాతావరణం అయితే లేదు అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు బాలీవుడ్ లో ఇక్కడికి వచ్చి భారీగా డిమాండ్ చేసే వారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇక వారు అందరిని కూడా కట్ చేస్తే మంచిది అనే ఆలోచనకు టాలీవుడ్ లో చాలా వరకు వచ్చేశారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: