మన తెలుగు లో ఒక సినిమా హిట్ అయితే చాలు చాలా వరకు దర్శకులకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క సినిమా స్టార్ హీరో తో చేస్తే చాలు ఇక వాళ్లకు వచ్చే ఆఫర్లు అన్నీ కూడా అదే రేంజ్ లో ఉంటాయి అనే మాట వాస్తవం. ప్రతీ ఒక్కటి కూడా వాళ్లకు అన్ని విధాలుగా కలుస్తూనే ఉంటుంది. ఇక స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు కూడా వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి అయితే మన తెలుగు లో ఉంది అనే చెప్పాలి. ఏ హీరో అయినా సరే టాలెంట్ ఉండి ఒక సినిమా హిట్ అయితే చాలు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. 

 

సినిమాలు  ఫ్లాప్ అయినా సరే తీసే విధానం చాలా వరకు బాగుంటే చాలు కచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా అవారిని నమ్మి భారీ సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు సుజిత్ ని చిరంజీవి ఇదే విధంగా నమ్మారు అని టాలీవుడ్ లో టాక్. అతను చేసింది రెండు సినిమాలు. అందులో ఒక సినిమా ఫ్లాప్. మరో సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇప్పుడు  అతనికి చిరంజీవి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నే వార్తలు వస్తున్నాయి. 

 

అతని టాలెంట్ ని ఆయన చాలా బాగా నమ్మారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇప్పుడు అతని తో కలిసి లూసిఫర్ సినిమా కథను చిరంజీవి రెడీ చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి సుజిత్ చిరంజీవి ఇంట్లోనే ఉన్నాడు  అని టాక్. అతనికి ఆయాన సలహాలు సూచనలు ఇస్తున్నారని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: