వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘పవర్ స్టార్’. ఈ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా రోజుకో స్టిల్ విడుదల చేస్తూ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా వర్మ రిలీజ్ చేసిన సినిమా స్టిల్స్ లో కొన్నిచోట్ల టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు మరియు చంద్రబాబు నాయుడు పాత్రలను పోలే విధంగా పోస్టర్లను రిలీజ్ చేయడం జరింగింది. సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్న తరుణంలో త్వరలోనే ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వర్మ హడావిడి చేయడం స్టార్ట్ చేసాడు.

IHG's 'Power Star' | Gulte - Latest ...

ప్రతి సినిమా మాదిరిగానే "పవర్ స్టార్" సినిమాకు సంబంధించి పోస్టులు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేయడంతో…అవి వైరల్ కావడంతో వాటికి సంబంధించిన స్టిల్స్ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్లు… తన పాత్ర తరహాలో నటించిన వ్యక్తి హావభావాలు చూసి పవన్ కళ్యాణ్ ఒక చిరునవ్వు నవ్వి వదిలేసినట్లు, పెద్దగా పట్టించుకోనట్లు ఆయన సన్నిహితుల నుండి వినబడుతున్న సమాచారం. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ "పవర్ స్టార్" సినిమా ని పెద్దగా పట్టించుకోవడం లేదని అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ దృష్టిలో లేనట్టే అన్నట్టు సన్నిహితులు తెలియజేస్తున్నారు.

IHG's Reaction On RGV's 'Power Star' | Gulte - Latest ...

ఇదే టైమ్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రామ్ గోపాల్ వర్మ ని పెద్దగా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో టాక్. "పవర్ స్టార్" సినిమా గురించి ఏమాత్రం రెచ్చిపోయిన అది రామ్ గోపాల్ వర్మ కి బెనిఫిట్ చేసినట్లు అవుతోంది అని అభిమానులు డిసైడ్ అయ్యి ‘పవర్ స్టార్’ సినిమాని లెక్కలోకి తీసుకోవడం లేదట. కానీ నార్మల్ సినిమా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ని రాంగోపాల్ వర్మ ఏ తరహాలో చూపించారో అని "పవర్ స్టార్" సినిమా పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: