‘సైరా’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి వినబడుతున్న వార్తలు రోజురోజుకీ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. చిరంజీవి కెరీర్లో 152వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ charan TEJA' target='_blank' title='రామ్ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్ చరణ్ దాదాపు అరగంట సేపు కలిగిన పాత్రలో నటించడం అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో దగ్గుబాటి రానా కూడా సినిమాలో నటించనున్నట్లు వార్తలు మొన్న వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు సమాచారం.

IHG

ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో తమన్నా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాకపోతే రెమ్యునిరేషన్ ఎక్కువ అడుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. గతంలో తమన్నా charan TEJA' target='_blank' title='రామ్ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్ చరణ్ తో 'రచ్చ' అనే సినిమాలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమాలో మాత్రం నటించడానికి కారణం చిరంజీవి పక్కన డాన్స్ చేయాలని కోరిక ఉండటంతోనే "ఆచార్య" ఐటెం సాంగ్ ఆఫర్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మణిశర్మ దాదాపు 12 సంవత్సరాల తర్వాత సంగీతమందిస్తున్నారు.

IHG

దీంతో అనేక ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ సినిమా పై మెగా అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో... ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో వైరస్ కంట్రోల్ లోకి వస్తే స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక మిగిలి ఉన్న సినిమా షూటింగ్ అతి తక్కువ టైమ్ లోనే ఏకధాటి షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: