బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా అసలైతే మే నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. కరోనా వల్ల వాయిదా పడ్డది. ఇంకో పదిరోజులు షూటింగ్ పెండింగ్ ఉండగా ఇప్పుడప్పుడే ఆ షూటింగ్ చేసే అవకాశం లేదని తెల్లుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేశారు. శృతి హాసన్ ను అనుకున్న ఈ సినిమాలో అనుకోకుండా మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చి చేరింది. 

 

ఈ టైం కల్లా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. పోస్టర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు వకీల్ సాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

 

ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమానే కాబట్టి వకీల్ సాబ్ కూడా పక్కా హిట్టే అంటున్నారు ఫ్యాన్స్. టీజర్ తో హడావిడి మొదలుపెట్టాలని చూస్తుండగా.. ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో హంగామా మొదలుపెట్టారు. సోషల్ మీడియా అంతా కూడా పవన్ ఫ్యాన్స్ హంగామా కనబడుతుంది. ఇక బర్త్ డే రోజు టీజర్ కూడా వస్తే మాత్రం అంతర్జాలం మొత్తం అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఆ హంగామా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆరోజు వరకు వెయిట్ చేయాల్సిందే.     

            

మరింత సమాచారం తెలుసుకోండి: