రోజు రోజుకి సినిమాలపై ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. చాలా వరకూ ప్రేక్షకులు మరియు యూత్ ఆడియన్స్ అడల్ట్ కంటెంట్ కలిగిన సినిమాలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో ఆ సినిమాలకు ఎక్కువగా లాభాలు రావడంతో సినిమా నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్ లోనే అడల్ట్ సినిమాలను తెరకెక్కించేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడల్ట్ సినిమాలకు హీరో గా సిద్దు జొన్నలగడ్డ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల కుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై “న్యూ ఏజ్ ఎంటర్ టైనర్” టైటిల్ తరహాలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

IHG

ఇప్పటికే హీరో సిద్దు జొన్నలగడ్డ అడల్ట్ కంటెంట్ కలిగిన "గుంటూరు టాకీస్" మరియు "కృష్ణ అండ్ హిజ్ లీలా" సినిమాలలో హీరోగా నటించాడు. ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలు చేయటంలో హిట్ కొట్టడంతో సిద్దు జొన్నలగడ్డ కాస్త దిట్ట అంటూ స్టాంపు పడింది. దీంతో చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ కలిగిన సినిమాల అవకాశాలు సిద్దు జొన్నలగడ్డ దక్కించుకుంటూన్నాడు. గతంలోనే సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ వారు ఈ హీరోతో సినిమాలు చేయడం విజయాలు సాధించడం జరిగింది.

IHG

మరొకసారి అదే తరహాలో సినిమా స్టోరీ రావడంతో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు సిద్దు జొన్నలగడ్డ కి మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా కాస్త రిస్క్ తీసుకుని సినిమా చేస్తున్నా గాని భారీ విజయాలనే సాధిస్తున్నాడు సిద్దు అని ఆయన పనితనం పై ఫిలిం నగర్ టాక్. సాధారణంగా ఇటువంటి సబ్జెక్ట్ కలిగిన సినిమాలు చేయటానికి చాలా మంది కుర్ర హీరోలు ముందుకు రారు, కానీ సిద్దు ధైర్యం చేసి సబ్జెక్టు పై నమ్మకం పెట్టుకొని సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: