బిగ్ బి. బాలీవుడ్ కి పెద్ద దిక్కు. ఆ మాటకు వస్తే యావత్తు భారతీయ పరిశ్రమకు ఆయన పితామహుడు లాంటి వారు. ఇపుడున్న సీనియర్ మొస్ట్ యాక్టర్లలో యాక్టివ్ ఆయన. అటువంటి అమితాబ్ కి కరోనా పాజిటివ్ రావడంతో అంతా హడలిపోయారు. దాదాపు ఎనిమిది పదులకు చేరువలో ఉన్న అమితాబ్  ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

IHG

ఆయనకు ఈ వయసులో కరోనా రావడం అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ వుడ్ ఈ వుడు అన్న తేడా లేకుండా బెంబేలెత్తింది. ఆ న్యూస్ తో ఇపుడు సినిమా రంగం అంతా కూడా వణికిపోతోంది.

IHG

అమితాబ్ అంతటి వారే కరోనా బారిన పడ్డారు. ఇక మన సంగతేంటి అని ముఖానికి రంగు వేసుకోవడానికే వెనకడుగు వేస్తున్నారు. బతికుంటే బలుసాకు  తింటాం కానీ ఇదేంటి బాబోయ్ అంటున్నారు. మొత్తానికి ఇవాళో రేపో షూటింగులకు వెళ్దామని అంతా ప్రిపేర్ చేసుకున్న వారు కూడా అమితాబ్ ఎపిసోడ్ తో పూర్తిగా డ్రాప్ అయి ఇంట్లో కూర్చుంటున్నారుట.

IHG

మొత్తం మీద చూసుకుంటే అమితాబ్ ఇచ్చిన షాక్ అలా ఇలా లేదుట. ఈ దెబ్బకు వాకిన్స్ చేతిలో పడితేనే తప్ప సినిమా రంగానికి కొత్త కళ వచ్చినట్లుగా  సీన్ కనిపించదని  అంటున్నారు.

IHG

ఏది ఏమైనా అమితాబ్ లాంటి లెజెండరీ పర్సనాలిటీ కరోనా బారిన పడడం కాదు కానీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఊగిపోయేలా చేశారు. ఇప్పట్లో షూటింగులు వద్దురా బాబోయ్ అనేంతలా భయం పెట్టేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: