సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లు తమ కింద పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ లను ప్రోత్సహిస్తూ వారికి లైఫ్ ఇస్తుంటారు. ఆ విధంగా వివాదాస్పద స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ ని అదేవిధంగా హరీష్ శంకర్ ని ప్రోత్సహించడం జరిగింది. ఈ తరహాలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వారు చాలామంది ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. ఒకవేళ తమ కింద పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు అవకాశాలు లేకపోతే సదరు స్టార్ డైరెక్టర్లు నిర్మాతలుగా మారి వారికి లైఫ్ ఇస్తున్నారు. ఈ విధంగా డైరెక్టర్ సుకుమార్ తన కింద అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తి ని సపోర్ట్ చేస్తూ నిర్మాతగా మారి అతని చేత సినిమా చేయించడం జరిగింది.

 

అదేవిధంగా రాజమౌళి మరియు వివి వినాయక్.. కొరటాల శివ..ఇంకా కొంత మంది డైరెక్టర్లు వారి దగ్గర పని చేసిన అసిస్టెంట్ లకు ఏదో రకంగా అవకాశం ఇస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ రచయిత నుండి డైరెక్టర్ గా మారి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన ఇప్పటి వరకూ తన కింద ఉన్న ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఆ డైరెక్టర్ నుండి కొత్త డైరెక్టర్లు ఎందుకు బయటకు రావటం లేదు అన్న చర్చ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో జరుగుతుంది.

 

అతనికి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయటం ఇష్టం ఉండదా అనే వాదన వినబడుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ లని ఎంకరేజ్ చేయడం పక్కనపెడితే, సినిమాలు చేయడంలో కూడా అదే పంతాన్ని ఆ డైరెక్టర్ అనుసరిస్తున్నారని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు నిదర్శనం ఇప్పటివరకు ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు అని టాప్ హీరోలకు సంబంధించినవే అని అంటున్నారు. ఏదిఏమైనా సదరు డైరెక్టర్ కి  'కొత్త' టాలెంట్ అనేది పడదు అనేది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: