కరోనా టైమ్ లో వర్మ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. షూటింగ్స్ అన్నీ లాక్ డౌన్ అయిన టైమ్ లో.. ఏది పడితే ఆ సినిమా తీసేస్తూ.. ఓటీటీలో హడావిడి చేస్తున్నాడు ఆర్జీవి. అందరూ ఇంట్లో ఉన్న టైమ్ లోనే డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన కాబోలు.. ఓటీటీలో సిినిమా చూడ్డానికే కాదు. ట్రైలర్ చూడటానికి కూడా టిక్కెట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు ఈ క్రిటికల్ అండ్ కరోనా మైండ్ వర్మ. 

 

కరోనాపై వర్మ పాడిన పాటలో అంతా మంచే జరుగు.. అని ఉంది. ఆ మంచి వర్మకు మాత్రమే. కరోనా కారణంగా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో.. రోజూ ఏదో ఒక వార్తతో ఉనికి చాటుకుంటున్నాడు ఆర్జీవీ. ఆ మధ్య మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీస్తే.. వర్మ పనైపోయిందనుకున్నారంతా. ఆ తర్వాత నాక్డ్ అంటూ సీగ్రేడ్ తీస్తే .. అది కాస్తా జెడ్ గ్రేడ్ అయింది. 

 

క్లైమాక్స్.. నాక్డ్ అంటూ ఎక్స్ పైర్డ్ గ్లామర్ తో రెచ్చగొట్టాలని చూసినా ఫలితం దక్కలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. పవర్ స్టార్ మూవీ తీస్తున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో క్లైమాక్స్ కు 100రూపాయలు టిక్కెట్ పెట్టగా.. నాక్డ్ కు 200 వసూలు చేశాడు. డబ్బులు సంపాదించేందుకు బాగా అలవాటు పడిన వర్మ.. చివరకు ట్రైలర్ చూసేందుకు కూడా టిక్కెట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట. 

 

కరోనా తగ్గితే.. పెద్ద హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా వచ్చేస్తారు. ఇంకా ఓటీటీలో మన సినిమాలు ఎవరు చూస్తారన్న భయం కాబోలు. లేదంటే.. దీపం ఉండగానే.. అదే కరోనా ఉండగానే.. నాలుగు డబ్బులు వెనకేసుకుందామన్న ఆలోచన కాబోలు. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్న వర్మ పవర్ స్టార్ ట్రైలర్ కు టిక్కెట్ పెడుతున్నాడు. సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బులను ఇలా లాగేసే మాస్టర్ ఆలోచనలో ఉన్నాడు ఆర్జీవి. ఇప్పటి వరకు కత్తులు.. గన్స్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యాక్షన్ మాఫియా సినిమాలు తీసిన వర్మ టిక్కెట్ పేరు చెప్పి వీక్ నెస్ తో ఆడుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: