టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. చాలా మంది స్టార్ హీరోలకి లక్కీ హీరోయిన్ అన్న పేరు సంపాదించుకొని వరసగా సూపర్ హిట్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అయితే ఒక్కసారిగా రకుల్ ప్రీత్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. 

 

IHG

 

అప్పుడే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ టబులతో కలిసి దే దే ప్యార్ దే అన్న సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడంతో అక్కడ క్రేజ్ వచ్చింది. అదే ఊపులో టాలీవుడ్ లో మన్మధుడు-2 లో నాగార్జున సరసన నటించింది. ఈ సినిమాలో అవకాశం రావడంతో టాలీవుడ్ లో రేస్ లో వెనకబడ్డ రకుల్ కి మళ్ళీ తన సత్తా చాటుతానన్న నమ్మకం కలిగింది. కాని ఆ నమ్మకాన్ని మన్మధుడు-2 లో దెబ్బతీయడమే కాదు వస్తాయనుకున్న సినిమా అవకాశాలను చేజార్చింది.

 

IHG

 

బాలీవుడ్ సినిమాతో వచ్చిన క్రేజ్ కాస్తా మన్మధుడు-2 ఎఫెక్ట్ రకుల్ మీద గట్టిగా పడటంతో ఒక్క తెలుగు సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తయారవుతున్న ఇండియన్ 2 లో మంచి ఛాన్స్ దక్కించుకుంది. అలాగే బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ త్వరలో ఈ సినిమాలో జాయిన్ కాబోతుందట.

 

IHG

 

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందే ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి తో ఆషెడ్యూల్ కాన్సల్ చేసి ముంబైలోనే చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేశారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే రకుల్ కి గుర్గావ్ నుండి మళ్లీ ముంబైకి చేరుకోబోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: