కరోనా వైరస్ రావటంతో సినిమా ఇండస్ట్రీలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో చాలామంది సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు కూడా ప్రస్తుత పరిస్థితుల బట్టి భవిష్యత్తులో ఎలా బతకాలి అన్న ఆందోళ‌న‌లో ఉంటున్నారు. ఏదైనా స్టార్ హీరో సినిమా.. థియేటర్  లో కాకుండా ఓటిటిలో రిలీజవుతుందంటే అది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇటువంటి తరుణంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు చాలా వరకు స్టార్ హీరోలను తమ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేయొద్దని, ప్రేక్షకులకు ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ని అలవాటు చేయొద్దని దండం పెడుతున్నారు.

 

పరిస్థితి ఇలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ డిజాస్ట‌ర్ లో ఉన్న రవితేజ, ప్రస్తుతం చేస్తున్న 'క్రాక్' సినిమాని ఓటిటిలో రిలీజ్ చేయాలని రెడీ అయిపోయాడు అంట. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఏదో విధంగా సినిమాని రిలీజ్ చేయాలని... ఓటిటిలో రిలీజ్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో చాలా మంది రవితేజ అలా చేస్తే ఇక స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో కాకుండా ఓటిటిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువై పోతాయని… సినిమా థియేటర్ల వ్యాపారం పడిపోతుందని చెప్పుకొస్తున్నారు.

 

ప్రేక్షకులంతా ఓటిటికి అలవాటు పడితే సినిమా నిర్మాతలు రాబోయే రోజుల్లో సినిమాలు చేసే అవకాశం ఉండదని చెప్పుకొస్తున్నారు. రవితేజ ఈ విషయంలో పునరాలోచించుకోవాలని వచ్చిన వార్తలపై ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. రవితేజ ‘క్రాక్’ సినిమా రిలీజ్ అయితే ఇదే టైమ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రాజెక్టులైనా వి, రెడ్, ఉప్పెన లాంటి సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: