2019 ఎన్నికల టైం లో వైసీపీ పార్టీలో జాయిన్ అయిన ఆలీ ఆ టైంలో ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో కష్ట పడటం జరిగింది. రాష్ట్రంలో మైనారిటీ నియోజకవర్గాలలో జగన్ పార్టీకి భారీ స్థాయిలో ప్రచారం చేశారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఆలీ సొంత ఊరు రాజమండ్రిలో ఆలీ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. దానికి కమెడియన్ ఆలీ కూడా భారీ స్థాయిలో కౌంటర్లు వేయడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో మంచి జిగిడి దోస్తులు గా పేరున్న వీరిద్దరిని రాజకీయాలు వచ్చి చెడగొట్టింది అని ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ కి చాలామంది అప్సెట్ అయ్యారు. కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ సినిమాలో అన్నిటిలో ఉన్న ఆలీ, రీ ఎంట్రీ సినిమాలో కూడా ఉంటారని అందరూ భావించారు.

 

కానీ పవన్ రీ ఎంట్రీ సినిమా “వకీల్ సాబ్” లో ఆలీ లేనట్లు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య ఇంకా రగడ కొనసాగుతుందని అందరూ డిసైడ్ అయిపోయారు. మరోపక్క వైసీపీ పార్టీకి ప్రచారం చేసినా గాని ఆ పార్టీ నుండి ఆలీకి సరైన సపోర్ట్ రాకపోవటంతో జగన్ కి ఆలీ కి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేనట్లు ఇటీవల వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో త్వరలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటీవల రచ్చ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి ఆలీ సోషల్ మీడియాలో గమ్మత్తయిన కామెంట్ పెట్టారు.

 

‘‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్..’’ అంటూ నమస్కారాలు తెలుపుతూ ఓ రెడ్ హార్ట్ సిగ్నల్‌ను అలీ పోస్ట్ చేశాడు. మరి ఎన్నికల టైంలో నీ బుద్ధి ఏమైంది అంటూ ఆయన్ని గట్టిగా టార్గెట్ చేశారు పవన్ అభిమానులు. చాలా మంది అభిమానులు రకరకాలుగా ఆలీకి సెటైర్లు వేశారు. వైసిపి లో సీట్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ కి హారతి పడుతున్నావా అంటూ కమెడియన్ ఆలీ పై కామెడీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: