ఇప్పుడు అందరి దృష్టీ ఈనెల రామ్ గోపాల్ వర్మ ధియేటర్ బ్యానర్ పైఓటీటీ లో విడుదల కాబోతున్న వర్మ పవర్ స్టార్ మూవీ పై ఉంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదల అవుతున్న స్టిల్స్ ను చూసిన వారు రామ్ గోపాల్ వర్మ ఈ మూవీలో ఎలాంటి బాంబులు పెల్చబోతున్నాడు అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆన్ లైన్ సినిమాలకు ఎటువంటి సెన్సార్ నిబంధనలు ఉండవు కాబట్టి వర్మ ఈ మూవీలో రెచ్చిపోవడం ఖాయం అని అంటున్నారు.


దీనితో బయట పడకపోయినా ఈ మూవీ గురించి పవన్ అభిమానులు చాల టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ద్వారా వర్మ చేయబోతున్న నెగిటివ్ ప్రచారానికి వ్యూహాత్మకంగా పవన్ అభిమానులు చెక్ పెడుతున్నారు.


ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ హ్యాష్ ట్యాగ్ కు 21 మిలియన్ ట్వీట్స్ రావడం లేటెస్ట్ రికార్డ్ గా మారింది. ఇప్పుడు ఆ రికార్డు పై దృష్టి పెట్టి పరోక్షంగా జూనియర్ రికార్డుకు చెక్ పెట్టడంతో పాటు వర్మకు సైలెంట్ వార్నింగ్ ఇచ్చే వ్యూహంలో ప్రస్తుతం పవన్ అభిమానులు చాల బిజీగా ఉన్నారు.  


వాస్తవానికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న వస్తుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు ఇంకా చాల సమయం ఉన్నా పవన్ అభిమానులు ‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే టు పవన్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసారు. ఈ హ్యాష్ ట్యాగ్ కు కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 27.5 మిలియన్ ట్వీట్ లు రావడం పవన్ మ్యానియాను సూచిస్తోంది. దీనితో వర్మ ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా అది వృథా గా మారి ఎవరు పట్టించుకోరు అన్న సందేశాన్ని పవర్ స్టార్ అభిమానులు పరోక్షంగా తెలియ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: