ముఖేష్ అంబాని బిజినెస్ కు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు అంటే దానికి తిరుగుండదు. త్వరలో మన ఇంటి పక్కన ఉండే దుకాణాల తీరు అన్ని మారిపోవడమే కాకుండా తన జియో మార్ట్ తో చిన్నచిన్న దుకాణాలను కూడ అనుసంధానం చేసి త్వరలో ప్రతిఇంటికి నిత్యావసర సరుకులతో పాటు తాజా కూరగాయలు పండ్లు వినియోగ దారుల ఇళ్లకే చేరే విధంగా రెలియన్స్ జియో మార్ట్ సరికొత్త బిజినెస్ వ్యూహాలు భారతదేశంలోని చిన్నచిన్న చిల్లర దుకాణాల తీరును మార్చివేయబోతున్నాయి. 


ఇప్పటివరకు ఇండియాలో ఈకామర్స్ అంటే కేవలం రెండు కంపెనీలే గుర్తొస్తాయి. వాటిలో ఒకటి ఫ్లిప్కార్ట్ అయితే  మరోటి అమెజాన్. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల వాటా 90% నికి పైగా ఉంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి రిలయన్స్ జియో చేరిపోవడంతో ఇండియన్ ఈకామెర్స్ రంగంలో ‘ముక్కోణపు పోటీ’ మొదలు కాబోతోంది. వచ్చే నాలుగేళ్లలో ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ 1,00,000 కోట్లకు పైగా చేరుకుంటుంది అన్న అంచనాలు ఉండటంతో ఇప్పుడు ఈ మార్కెట్ పై ముఖేష్ అంబాని కన్నుపడటం పారిశ్రామిక రంగాలలో హాట్ న్యూస్ గా మారింది. 


ప్రస్తుతం కరోనా సమస్యలు వల్ల ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులలో కూడ రెలియన్స్ సంస్థ తన కంపెనీ వాటా దారుల వార్షిక సమావేశం జియో మీట్ సహాయంతో 48 దేశాలలోని 550 నగరాలలో 3.2 లక్షల మంది వీక్షించేలా చేసిన ప్రయత్నం సక్సస్ కావడంతో రానున్న రోజులలో భారత్ లో జియో మీట్ యాప్ ఎలా దూసుకు పోతుందో అందరికీ అర్ధం అవుతుంది. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు కూడ కార్యాలయాలలో జరుగుతున్న సమావేశానికి వర్చువల్ గా హాజరు కావచ్చు.


దీనితో ఇక రానున్న రోజులలో 3డీ వర్చువల్ గదులలో క్లాస్ రూమ్ తరగతులు ఉండబోతున్నాయి అన్న సంకేతాలు రావడమే కాకుండా ఇలాంటి పరికరాల ధరలు కేవలం 40 వేల లోపు ఉంటుంది అని తెలుస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో ఆన్ లైన్ చదువులకు పాఠాలకు పెరగబోతున్న ప్రాధాన్యత తెలుస్తోంది. దీనితో అంబాని రెలియన్స్ శంఖారావం పారిశ్రామిక వర్గాలలో పెను మార్పులు తీసుకు రాబోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: