తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు మొత్తంగా నాలుగుసార్లు దేవదాసు పేర్లతో సినిమాలు రావడం జరిగింది. అయితే వాటిలో ఏది ఏ రేంజ్ విజయం అందుకుందో, ఫైనల్ గా వాటిలో ఎవరు నటించిన దేవదాసు విజేతగా నిలిచిందో చూద్దాం. ముందుగా ఏఎన్నార్, సావిత్రి ల కలయికలో 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన హృద్యమైన ప్రేమకథా చిత్రం దేవదాసు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవదాసుగా నాగేశ్వరరావు అత్యద్భుత నటన ఆ సినిమాకు ప్రధాన హైలైట్ కాగా, పార్వతిగా సావిత్రి కూడా గొప్ప నటనను కనబరిచారు. 

 

అప్పట్లో ఆ సినిమా ఎంతో పెద్ద సక్సెస్ అవడంతో పాటు, ఆపై ఏఎన్నార్, సావిత్రిలకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ల కలయికలో 1974లో వచ్చిన దేవదాసుకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆపై యంగ్ హీరో రామ్, ఇలియానాల కలయికలో 2006లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా కూడా ప్రేమకథగా తెరకెక్కింది. రామ్, ఇలియానా ఇద్దరూ కూడా టాలీవుడ్ కి పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని వారిద్దరికీ కెరీర్ పరంగా మంచి భవిష్యత్తుని అందించింది. 

 

వీటి అనంతరం కింగ్ అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నానిల కలయికలో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవదాస్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. లవ్, ఫ్రెండ్షిప్, యాక్షన్, ఎమోషన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున రౌడీ గా నటించగా, నాని డాక్టర్ గా నటించారు. మొత్తంగా నాలుగు సార్లు దేవదాసు, దేవదాస్ పేర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాల్లో, తొట్టతొలిగా ఏఎన్నార్ హీరోగా తెరకెక్కిన దేవదాసు ఫైనల్ విజేత అని చెప్పాలి. అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా, ఆపై కొన్నేళ్ల తరువాత రి రిలీజ్ చేసినప్పటికీ కూడా అత్యద్భుతంగా కలెక్షన్ రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: