టాప్ మ్యూజిక్ డైరెక్టర్. లెజెండరీ పర్సనాలిటీ ఏ ఆర్ రహమాన్ ఒక చరిత్రనే స్రుష్టించారు. ఆయనది పాతికేళ్ళకు పైగా సినీ అనుబంధం, ఇక సాధించిన కీర్తి ఖండాంతరాలు పాకింది. రహమాన్ మ్యూజిక్ సునామీ అని చెప్పాలి. ఆయన స్వరాలు చెవులకు వరాలు. అటువంటి రహమాన్ని మ్యూజిక్ మెజీషియన్ అంటారు. సంగీత మాంత్రికుడు అని కూడా అభివర్ణిస్తారు.
ఇక రహమాన్ తన వారసురాలికి కూడా చిత్ర సీమకే అంకితం చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉంటే పెద్ద కుమార్తె సినీ రంగ ప్రవేశానికి ఉవ్విళ్ళూరుతోంది. ఆమె పేరు రహిమ. తండ్రి వారసత్వంగా సంగీతాన్నే ముందు ప్రొఫెషన్ గా ఎంచుకుంది. అనేక మ్యూజిక్ వీడియోలు చేసి యూత్ ని ఉర్రూతలూగించింది. ఇక ఇపుడు ఆమె చూపు నటన మీద పడిందట.
నటనలో మెలకువలకు శిక్షణ తీసుకున్న రహిమా వెండి తెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనుకుంటోందిట. ఆమె కోరికను మన్నించిన రహమాన్ సరేననడంతో వచ్చే ఏడాది ఆమె బాలీవుడ్ నుంచి నటిగా ఎంట్రీ ఇస్తుందని టాక్. ఓ టాప్ చలన చిత్ర ప్రముఖుని చేతుల మీదుగా రహిమ లాంచింగ్ ఉంటుందని అంటున్నారు.
సంగీత ప్రపంచానికి రహమాన్ తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న వేళ కుమార్తె తనదైన నటనతో ఎన్ని రికార్డుకు క్రియేట్ చేస్తుందో. జాతీయ స్థాయిలో రాణించి తండ్రికి తగ్గ తనయగా అనిపించుకుంటుందో కదా. ఇవన్నీ చూడాలి మరి. ఏది ఏమైనా రహమాన్ ఒక తండ్రిగా కుమార్తె నటనాసక్తికి మెచ్చి ఆమె కోరికను తీర్చడం మాత్రం మెచ్చుకుని తీరాలి.