జీరో అంటే జీరోనే . అది పెద్ద సున్నా. ఒకటి పక్కన నిలబడితే ఎంతో విలువ. కానీ ఒక్కతే వస్తే మాత్రం అది గుండు సున్నావే. సున్నాలు పెట్టడమే సున్నాకు తెలుసు. ఇపుడు అది ఇంకా బాగా రుజువు అవుతోంది. కరోనా పుణ్యమాని ఈ ఏడాది అంతా జీరోని పెట్టేసింది. కాలానికి కూడా  జీరో పెట్టి సైడ్ చేసే సత్తా ఒక్క కరోనాకే ఉందని నిరూపించింది.

 

ఇక ఈ ఏడాది ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, విందూ వినోదాలు అంతకంటే లేవు. ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపు అయినా జరుపుకోవచ్చు. కానీ చిన్నారుల చదువు అలా కాదు కదా. ఈ ఏడాది ఆ పై ఏడాది చదువుతూ వెళ్తేనే కదా విలువ ఉండేది. వారు కూడా తెలివితేటలతో జీవితంలో ముందుకువచ్చేది.

 

కానీ కరోనాకు అవన్నీ అనవసరం. అందుకే ఈ ఏడాది అంతా ఇంట్లోనే ఉండాలని శాసించింది. దాంతో చదువులు కూడా చట్టుబండలైపోతున్నాయి. ఇప్పటికే నాలుగు నెలలు గాలికి తిరిగి ఖాళీని మరిగి పిల్లలు ఎటూ కాకుండా పోయారు. విద్యాసంవత్సరంలో  రెండు నెలలు కూడా గడచిపోయాయి.

 

ఇపుడు మిగిలిన నెలలు కూడా వేస్ట్ అయిపోయేలా ఉన్నాయి. అంతా కరోనా మహిమ. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కరోనా మరింత విస్తరిస్తుంది అని అంటున్నారు. ఇక శీతాకాలం కూడా కరోనాదే రాజ్యమని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే పిల్లలను తరగతులు తెరచినా పంపేందుకు కూడా తల్లిదండ్రులు రెడీగా లేరు. దాంతో ఈ ఏడాదిని జీరో యియర్ గా డిక్లేర్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది.

 

ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా చర్చ జరపడంలేదు. దాంతో ఈ ఇయర్ ని క్యాలండర్ నుంచి తొలగించి కంప్లీట్  జీరో ఎడ్యుకేషన్ ఇయర్ గా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అదే కనుక జరిగితే కరోనా వల్ల వచ్చిన అతి పెద్ద మార్పులలో ఇది అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవాలేమో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: