అనుష్క అండ్ తమన్నా... అవును... ఈ ఇద్దరే ప్రస్తుతం అత్తా కోడళ్లుగా నటిస్తున్నా హాట్ బ్యూటీస్! దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సౌత్ లోని కర్ణాటకకి చెందిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో ఎంత క్రేజీనో మనకు తెల్సిందే! ఈ బొమ్మాళి సినిమాలో వుందంటే చాలు... బొమ్మ హిట్ అన్నట్టే! అందుకే, టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లో కూడా అనూ కోసం నిర్మాత, దర్శకులు, హీరోలు ఎగబడతారు. అనుష్కతో పొల్చితే.... అరుంధతి లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలేం లేవు తమన్న కెరీర్లో. అయినా కూడా ఈ హ్యాపి డేస్ హాటీని చూస్తే.... తెలుగు యూత్ కి హ్యాపి మూమెంట్సే! పవన్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్... ఇలా టాప్ హీరోస్ అందరితోనూ తమ్మూ రొమాన్స్ చేసేసింది. హిట్స్ అండ్ ఫట్స్ తో సంబంధం లేకుండా గ్లామర్ గిరి నడిపిప్తోంది. ఇక్కడే కాదు తమిళం, హిందీల్లో కూడా తమన్నా కుర్రకారు తహతహలు పెంచేస్తోంది! టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో తమ గ్లామర్ తో ఫుల్ గా డామినేట్ చేస్తోన్న అనుష్క, తమన్నా ఇప్పుడు ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే బాహుబలి! ఈ ప్రభాస్ స్టారర్ మూవీలో అనుష్క మెయిన్ హీరోయిన్ అని మనకు తెల్సిందే. అయితే, తమన్నా మరో ఫీమేల్ లీడ్ గా కనిపిస్తుందని కూడా తెలుసుకదా! కాని, అకార్డింగ్ టూ ది లేటెస్ట్ బజ్.... అనుష్క, తమన్నా బాహుబలిలో అత్తాకోడళ్లట! ఎంత వరకూ నిజమోగాని... డబుల్ రోల్ చేస్తోన్న ప్రభాస్ కు ఈ ఇద్దరూ జోడీగా కనిపిస్తారట. అంటే అనుష్క.... తండ్రి పాత్రలోని ప్రభాస్ కి, తమన్న కొడుకు పాత్రలోని ప్రభాస్ కి హీరోయిన్ అన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: