డైమండ్ ఈజ్ ఫరెవర్! అందుకే, తమ రొమాంటిక్ రిలేషన్ షిప్ ఫరెవర్ నిలిచిపోవాలని కోరుకునే లవర్స్… డైమండే గిఫ్ట్ గా ఇచ్చుకుంటారు. అఫ్ కోర్స్! అమ్మాయిలు అబ్బాయిలకి డైమండ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఎక్కువగా వినిపించదనుకోండి! ఎందుకంటే.... గాళ్స్ ఆర్ దెమ్ సెల్వ్స్. డైమండ్స్ కాబట్టి! ఇక అబ్బాయిలు మాత్రం తమ లవ్ ని డైమండ్ తో పదే పదే ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. అండ్ దట్ టూ.... తమ బిలవ్డ్ బ్యూటీ. బాలీవుడ్ బేబీ అయితే... మరింత కాస్ట్ లీ వజ్రాన్నే ముట్టజెపుతారు! వెరీ రీసెంట్లీ... బాలీవుడ్ లో ఓ భారీ వెడ్డింగ్ జరిగిపోయింది. ఎలాంటి హడావుడీ చేయకుండా ఆ ఇద్దరూ.... ఇటలీకి పోయి మ్యారేజ్ చేసేసుకున్నారు. యెస్... యూ ఆర్ రైట్.... మనం మాట్లాడుకుంటోన్నది రాణి అండ్ హర్ రాజా... ఆదిత్య చోప్రా గురించే! ఈ పెళ్లి విషయం పోయిన సంవత్సరం నుంచే న్యూస్ లో వుంటోన్న వీళ్లిద్దరూ వున్నట్టుండి పెళ్లి చేసుకోటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాణి ముఖర్జీ కాస్తా రాణి చోప్రా అవ్వటంతో మరో సారి కొందరు రీసెర్చర్ల దృష్టి డైమండ్ రింగ్స్ పై పడింది! సాధారణంగా ఓ అమ్మాయి సుకుమార, సుందరమైనమైన వేలిపై వజ్రం తళుక్కున మెరిస్తే... అది ఎంగజేమె ట్కి సింబల్ గా భావిస్తాం. చాలా వరకూ మన గెస్ కరెక్టే అవుతుంది కూడా. ఇక సదరు అందగత్తె రాణి ముఖర్జీ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీ అయితే.... మీడియా మరింత ఉత్సాహంగా ఊహాగానాలు చేసేస్తుంది. 2013లో రాణి ఓ పార్టీలో ఛమక్కున మెరిసే పెద్ద వజ్రపుటుంగరంతో కనిపించింది. అప్పట్నుంచే ఆదితో ఆమె పెళ్లి పక్కా అంటూ వార్తలు ఊపందుకున్నాయి..... ఇన్ ఫ్యాక్ట్ .... మోస్ట్ బ్యూటీఫుల్ లేడీ ఆన్ ఎర్త్... ఐష్ కూడా వజ్రంతో మెరిసిపోయింది. ఆమెకి అభీ పెళ్లి సమయంలో కొనిపెట్టిన ఉంగరం దాదాపూ 50లక్షల పైమాటే అప్పట్లో న్యూస్ చక్కర్లు కొట్టింది.... ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో టాప్ పొజీషన్లో వున్న సిద్దార్థ్ రాయ్ కపూర్నీ పెళ్లాడిన విద్యాబాలన్ తన వెడ్డింగ్ రింగ్ తో కళ్లు పెద్దవి చేసేసింది. ఈమె డైమండ్ వాల్యూ ఎంతో తెలియదుగాని... ట్రెడిషనల్ లుక్ వుండటం విశేషం! ఇక తెలుగు వారి హాసిన జెనీలియా... జెనీలియా దేశ్ ముఖ్ అయ్యే క్రమంలో.... రితేష్ నుంచి కాస్ట్ లీ రింగే గిఫ్ట్ పొందింది. ఆమె ఆ ఉంగరంతో తన సంగీత్ సెలబ్రేషన్స్ లో దర్శనమిచ్చింది. కపూర్ ఖాన్ దాన్ లో పుట్టి... నవాబ్ ఖాన్ దాన్ కి మెట్టిన... బేగం కరీనా కూడా డైమండ్ రింగ్ తో చూపరులను ఆకర్షించింది. 2012లోనే తన గార్జియెస్ గాళ్ ఫ్రెండ్ కి సైఫ్ మిరిమిట్లు గొలిపే ఉంగరం బహూకరించాడు. అయితే, లారా దత్తా, ఈషా డియోల్ ఎక్సెట్రా ఎక్సెట్రా.... ఇలా చాలా మందే వున్నారు బి-టౌన్ డైమండ్ బ్యూటీస్. వాళ్లందర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది... తెలుగు వారి సాగరకన్య... సొగసుల శిల్పం.... శిల్పా శెట్టి గురించే! ఎందుకు అంటారా? ఈమెకి భర్త రాజ్ కుంద్రా ఓ పెద్ద వజ్రపుటుంగరం వేలికి తొడిగాడు! 20 క్యారెట్ల ఆ స్వచ్ఛమైన రాయి... అక్షరాలా 3 కోట్ల పై మాటే! ఇలాంటి కోట్లు ఖరీదు చేసే అందమైన వేలు... బాలీవుడ్లో ప్రస్తుతానికైతే మరెవ్వరికీ లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: