అల్లు అర్జున్ , అనుష్క , రుద్రమదేవి సినిమా చేయాలని గుణశేఖర్ చేసిన రిస్క్ , ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్ , అలనాటి కాకతీయ సామ్రాజ్యాన్ని మరోసారి మన కళ్ళకు చూపడం , విజువల్స్ అల్లు అర్జున్ , అనుష్క , రుద్రమదేవి సినిమా చేయాలని గుణశేఖర్ చేసిన రిస్క్ , ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్ , అలనాటి కాకతీయ సామ్రాజ్యాన్ని మరోసారి మన కళ్ళకు చూపడం , విజువల్స్ కథనం , పాత్రలలో బలం లేకపోవడం , ఎలివేషన్ లేకపోవడం , ఎడిటింగ్ , దర్శకత్వం , మొదలుగునవి

కాకతీయ వంశ రాజు గణపతి దేవ రాజు (కృష్ణం రాజు) రాజ్యం మీద దాడి చెయ్యడానికి సిద్దం గా ఉంటారు దేవగిరి రాజులు అంతే కాకుండా సామంత  రాజులు కూడా సింహాసనం దక్కించుకోడానికి చూస్తుంటారు. గణపతి దేవరాజు కి కొడుకు జన్మిస్తే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని ఆ రాజ్య ప్రజలు నమ్ముతుంటారు కాగా గణపతి దేవా రాజు కి కూతురు పుడుతుంది. మహా మంత్రి అయిన శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) సలహా మేరకు పుట్టింది ఆడపిల్ల కాదని మాగాపిల్ల్లాడే అని  నమ్మిస్తారు పేరు "రుద్రదేవ(అనుష్క)" అని పెడతారు. యుద్ద రంగంలో శిక్షణ పొందుతూ ఆరితేరిన రుద్రదేవునికి ఇద్దరు స్నేహితులు ఉంటారు. చాళుక్య వీరభద్రుడు(దగ్గుబాటి రానా) మరియు గోన గన్న రెడ్డి(అల్లు అర్జున్) ఇదే సమయంలో యుద్దానికి సిద్దం అవుతుంటాడు దేవగిరి రాజు మహాదేవ నాయకుడు ఆలోచిస్తుంటాడు. తండ్రి మరణంతో సామంత రాజుల మీద  కక్ష కట్టిన గోన గన్న రెడ్డి ఒక్కోకరిని చంపుతూ వస్తుంటాడు ఎప్పటికి అయిన రుద్రదేవుని చావు తన చేతిలోనే అని ప్రతిన చేస్తాడు.. ఇదిలా సాగుతుండగా రుద్రదేవునికి ముక్తంబ(నిత్య మీనన్) ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న రుద్రమదేవి ని చూసి మనసు పెడతాడు వీరభద్రుడు ఎలాగయినా రుద్రదేవుడిని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు .. ప్రజలకు రుద్రదేవుడు రుద్రమదేవి అని ఎప్పుడు తెలిసింది? రుద్రమదేవి గోన గన్నా రెడ్డి ని ఎలా ఎదురుకుంది? రుద్రదేవుడే రుద్రమ దేవి తాను ప్రేమించిన అమ్మాయి అని తెలిసిన వీరభాడురుడు ఎం చేసాడు? అనే అంశాలు తెర మీద చూడవలసిందే.. 

ఈ చిత్రం మొత్తం అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుంది అనుష్క కూడా ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డట్టు కనిపిస్తుంది అనుష్క ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు, పాత్రకు తగ్గ హావభావాలు , ధీరత్వం అద్భుతంగా పలికించారు. కాని ఈ చిత్రం మొత్తం ఈ పాత్ర చుట్టే తిరిగినా చిత్రంలో ఈ పాత్రకి అంత గొప్పతనం ఉండదు. సరయిన ఎలివేషన్ లేదు, ఈ పాత్ర యొక్క ప్రాముఖ్యత మరియు దృడత్వం ని సరిగ్గా చూపెట్టలేదు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నా రెడ్డి పాత్ర ఈ చిత్రానికి హైలెట్ , అయన వేషధారణ మరియు యాస బాగా సెట్ అయ్యింది. ఆయనకి రాసుకున్న డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో ఈ పాత్ర కాస్త ఊరట ఇస్తుంది. ఏదిఏమైనా రుద్రమదేవి లాంటి ఓ హిస్టారికల్ సినిమాని తెరపైకి తీసుకురావడానికి సహకరించిన అనుష్క, అల్లు అర్జున్ లకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. రానా పాత్రకి అంత ప్రాముఖ్యత లేదు ఉన్నంతలో అతని నటన బాగుంది. ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఉంటె బాగుండేది. విక్రంజీత్ నటన పరవాలేదు, కేథరిన్ త్రెస నటనతోనే కాకుండా అందచందాలతో కూడా ఆకట్టుంది. ప్రకాష్ రాజ్ , సుమన్, కృష్ణం రాజు , కృష్ణ భార్గవ్ , హంస నందిని, వెన్నెల కిషోర్,బాబా సెహగల్, శివాజీ రాజ , ఉత్తేజ్ ఇలా పలువురు నటులు తెర మీద కనిపిస్తారు కాని ఏ పాత్ర గుర్తుండిపోయే స్థాయిలో లేదు.. 

ముందుగా రాణీ రుద్రమదేవి కథని మన తెలుగు భావితరాలకు అందిచాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తలపెట్టిన గుణశేఖర్ కి మా తరపున హ్యాట్సాఫ్ చెబుతున్నాం. అదీ తన నిర్మాత అయ్యి చెయ్యడం మరోసారి ఆయన్ని మెచ్చుకోదగిన అంశం. ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు ఆయన్ని మెచ్చుకున్నా సినిమా పరంగా ఆయన పనితనం ఎలా ఉందొ చెప్పాలి కాబట్టి.. ఇక సినిమాలోకి వెళ్దాం.. రాణి రుద్రమ దేవి కథ ప్రతి విద్యార్థికి తెలిసిందే అదే కథతో మన ముందుకు వచ్చారు గుణశేఖర్, కథనంలో వేగం విషయంలో గుణ శేకర్ పూర్తిగా తడబడ్డారు. చిత్రం అసలు ముందుకు సాగుతున్నట్టు ఎక్కడా అనిపించదు పాత్రల ప్రాముఖ్యతను సరిగ్గా చూపించలేదు. రుద్రమదేవి కష్టం ఏంటో సరిగ్గా చూపెడితే కదా ఎలా అధిగమిస్తుందో అన్న ఆసక్తి కలిగేది దర్శకుడు ఈ విషయంలో దారుణంగా విఫలం అయ్యారు. మాటలు అందించిన పరుచూరి సహోదరులు మరియు విపంచి పెద్దగ ఆకట్టుకోలేకపోయారు. అజయ్ విన్సెంట్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇళయరాజా సంగీతానికి మరియు తోట తరణి ఆర్ట్ వర్క్ కి పేరు పెట్టలేము అంత పగద్భందీగా ఉన్నాయి..  దర్శకుడిగా కూడా గుణశేఖర్ దారుణంగా ఫెయిల్ అయ్యారు , చిత్రం మీద  ఎక్కడా కనిపించదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అంతంత మాత్రమే చిత్రం చాలా సాగుతుంది రెండున్నర గంటల చిత్రమే అయినా రెండు రోజులు గడిపిన ఫీలింగ్ వస్తుంది. కాస్ట్యూమ్స్ ఇంకాస్త బాగుండాల్సింది. మొత్తంగా సాంకేతికంగా అన్ని విభాగాలు విజయం సాదించలేకపోయిన చిత్రం రుద్రమదేవి. నిర్మాణ విలువల విషయానికి వస్తే సెట్స్ కాస్ట్యూమ్స్ బాగానే ఉన్నాయి కొన్ని  గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి కాని కొన్ని చోట్ల మరీ నాసిరకంగా ఉన్నాయి..

చరిత్ర గురించి  చెప్తుంటే గర్వంగా అనిపించాలి కాని నీరసంగా కాదు, రుద్రమదేవి ప్రపంచానికి చాలా నేర్పింది మన దేశంలో ఆడవాళ్ళకి ఆదర్శం అలాంటి పాత్ర కథ చెప్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు గర్వంగా ఫీల్ అయ్యేలా చెయ్యాలి అంతే కాని అనవసరమయిన సాగదీత సన్నివేశాలతో నీరసపడేలా చెయ్యకూడదు. అలాగే రాణీ రుద్రమదేవి అంటే వీరణారి గానే తెలుసు కానీ మన డైరెక్టర్ గుణశేఖర్ ఆమె వీరోచిత పోరాటాల్ని ఎక్కడా చూపించలేదు సరికదా సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా రోమాలు నిక్కబోడుచుకునే సీన్ లేదు. ఇదొక హిస్టారికల్ ఫిల్మ్, కత్తులు పట్టుకొని యుద్దాలు చేస్తారు, వ్యూహరచనలు ఉంటాయి. కానీ ఎక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోదు. ఎందోలె రుద్రమదేవి లాంటి ఓ బ్రహ్మాండమైన కథని చిన్న పిల్లలు చెప్పుకునే పిట్టకథల్లా చెప్పడం ఒకరకమైన అవమానకరం అని చెప్పాలి. ఈ సినిమాని ఎక్కువ భాగం సేవ్ చేసేది, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ చేసిన ఎపిసోడ్స్ అండ్ అతని డైలాగ్స్, ఆ తర్వాత అనుష్కే కాస్త బెటర్ సేవియర్.. గుణశేఖర్ కెరీర్లో వచ్చిన ది వరస్ట్ అవుట్ పుట్ సినిమాల లిస్టులో రుద్రమదేవిని ముందు వరుసలో పెట్టచ్చు. ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం..'సాహో ప్రేక్షకదేవుల్లారా.. సాహో'.. 

Anushka Shetty,Allu Arjun,Rana Daggubati,Gunasekhar,Ilaiyaraaja.మన జాతి — మన పౌరుషం— మన మహారాణి రుద్రమదేవి

మరింత సమాచారం తెలుసుకోండి: