కాన్సెప్ట్ ,నేపధ్య సంగీతం ,సినిమాటోగ్రఫీ కాన్సెప్ట్ ,నేపధ్య సంగీతం ,సినిమాటోగ్రఫీ పట్టు లేని కథనం ,ఊహించదగ్గ సన్నివేశాలు ,సందర్భం లేని పాటలు ,ఎడిటింగ్ ,సుష్మ రాజ్ మరియు అవంతిక ల నటన ...

మేఘన (అవంతిక) కి జరగబోయేది ముందే తెలిసిపోయే అసాధారణ శక్తి ఉంటుంది సాంకేతికంగా దీన్ని ఎక్స్ట్రా సెన్సారి పెర్సేప్షన్ లేదా సిక్స్త్ సెన్స్ అంటారు. ఇలా తనకి అప్పుడప్పుడు జరగబోయే విషయాల గురించి ముందుగానే పూర్తిగా తెలుస్తుంది. టీవీ 21 లో రిపోర్టర్ గా పని చేసే మేఘన కి దేశంలోనే ప్రఖ్యాతి కాంచిన ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ (హర్షవర్ధన్ రాణే) తో ఒక కార్యక్రమం చేసే అవకాశం వస్తుంది. ఇదిలా సాగుతుండగా మేఘనకి జరగబోయే కొన్ని సంఘటనలు ముందే తెలిసి వాటిని జరగకుండా అడ్డుకుంటుంది. సిద్దార్థ్ మంచితనాన్ని చూసిన మేఘన అతనితో ప్రేమలో పడిపోతుంది కాని అతనికి ఆ విషయం చెప్పదు. సిద్దార్థ్ కూడా మేఘన ని ఇష్టపడుతూ ఉంటాడు కాని చెప్పడు. ఈలోగా వీరి మధ్యలోకి ప్రవేశిస్తుంది మేఘన చిన్ననాటి స్నేహితురాలు పూజ(సుష్మ రాజ్). అప్పటికే పూజ కి మరియు సిద్దార్థ్ కి పెళ్లి నిశ్చయం అయ్యి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మేఘన వాళ్ళిద్దరి మధ్య నుండి దూరంగా ఉంటూ తన పనేదో తను చేసుకుంటుంది. ఈలోగా తనకున్న శక్తి ద్వారా తనకి కొన్ని విషయాలు తెలుస్తుంది .. సిద్దార్థ్ , పూజని హత్య చేసినట్టు తనకి కనిపిస్తుంది... అంతే కాకుండా తన దగ్గర మోడలింగ్ చేస్తున్న వైశాలి(నందిని రాయ్) ని కూడా హత్య చేసినట్టు కనిపిస్తుంది.. ఆ తరువాత ఏమయ్యింది పూజ ని సిద్దార్థ్ నుండి మేఘన కాపాడుకోగలిగిందా? అసలు వైశాలి ఎవరు? అన్న అంశాలు మాయ చిత్రంలో చూడవలసిందే...

హర్షవర్ధన్ రాణే ఈ నటుడు మొదటి నుండి విభిన్నమయిన చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్రం కూడా విభిన్నం అయినదే అయన నటన కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నారు. మరీ చిత్రాన్ని భుజాల మీద మోసేసే పాత్ర కాకపోవడంతో అతని నటన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అవంతిక, ఈ నటి అందంగా ఉంది అభినయ పరంగా బాగుంది కాని ఈ అమ్మాయి డిక్షన్ మీద చాలా శ్రద్ధ వహించాలి చాలా సన్నివేశాలలో ఆమె అభినయం స్థాయిమేరకు లేదు. ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన తేలిపోయింది. సుష్మ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటీ నటి పాత్ర తీరు అంతేనా లేకపోతే ఈ నటి తన ప్రతిభ చూపించుకోవడానికి నటించిందో తెలియట్లేదు కాని అందరి నటన తనే నటించేసి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించింది కాని అవసరం కన్నా ఎక్కువగా నటిస్తే పాత్ర స్వభావం దెబ్బతింటుంది అన్న విషయం గ్రహించలేదు. నందిని రాయ్ పాత్ర ఈ చిత్రంలో చాలా ముఖ్యమయిన పాత్ర అయినా కూడా ఈ నటించే ఆస్కారం దక్కలేదు ఉన్న రెండు మూడు సన్నివేశాలలో పరవాలేదనిపించింది. నాగబాబు కొన్ని సన్నివేశాలలో కనబడి తన వంతు "పాత్ర" తను పోషించాడు. అనిత చౌదరి, ఝాన్సీ , వేణు మరియు ఇతర నటీనటులు వారి పరిధి మేరకు నటించారు ....

కథ, జరగబోయేది ముందుగానే తెలియడం అన్న పాయింట్ మీద రాసుకున్న ఈ కథ నిజానికి కొత్తది కాదు కాని దీనికి పెట్టుకున్న పేరు మాత్రం కొత్తది ఎక్స్ట్రా సేన్సోరి పెర్సేప్షన్ ఇప్పటి వరకు అతీంద్రియ శక్తిలానే చూపించిన ఈ విషయానికి విజ్ఞాన శాస్త్రాన్ని జోడించి తెర మీదకు తీసుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం కాని సమస్యల్ల అతను రాసుకున్న కథనం మీదనే వచ్చింది, చేతిలో నిప్పు లాంటి కథ ఉన్నప్పుడు దాంతో అసాధారణ పనులు చెయ్యడం మానేసి కొవ్వొత్తి వెలిగించడం మరియు కుంపటి వెలిగించుకోవడం లాంటి అత్యంత సులువుగా ఊహించదగ్గ పనులు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ చిత్ర కథనం కూడా, మాటలు అంత గొప్పగా లేవు చిత్రం మొదలవక ముందు వేసిన వాక్యాలు మరియు చిత్రం అయిపోయాక వాడిన పదాల ని కనెక్ట్ చేసేలా కొన్ని సంభాషణలు రాసుకొని ఉంటె బాగుండేది. ఇక దర్శకత్వం విషయానికి వస్తే ఇప్పటి వరకు నీలకంట గారి చిత్రాలు బాగాలేదు అనేవారు కాని అయన దర్శకత్వంలో ఎటువంటి లోపం ఉండేది కాదు నటులు కూడా పాత్రకు తగ్గట్టు నటించేవారు కాని మొదటి సారి అయన చిత్రంలో నటీనటుల నటన బాగోలేదు అనిపించింది. మరి ఇలా ఎందుకు జరిగిందో నీలకంత గారికే తెలియాలి... చిన్న బడ్జెట్ సినిమానే అయినా అలా కనపడనివ్వలేదు సినిమాటోగ్రాఫర్. ఎడిటర్ మొదటి అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కత్తిరించి ఉండాల్సింది. సంగీతం అందించిన శేఖర్ చంద్ర పాటలు మరియు నేపధ్య సంగీతం రెండు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని నమ్మి చిత్రాన్ని తెరకెక్కించడం ధైర్యం తో కూడుకున్న విషయం..

పారా సైకాలజీ అనే అంశం మీద తెలుగులో చిత్రాలు రావడం చాలా అరుదు నిజానికి ఇదేదో అతీంద్రియ శక్తులు వింత మనుషులు అని కాకుండా ప్రతి మనిషిలో ఉన్న ఒక ఇంద్రియం ఒక మనిషిలో అధికంగా పని చెయ్యడమే పారా సైకాలజీ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు. ఇదేదో గొప్ప వరం అని కాకుండా ఇలాంటి ఒక మనిషి కథ చెప్పాలని అనుకోవడం గొప్ప ఆలోచన కాని దర్శకుడు ఇదే విషయాన్నీ ఒక అద్భుతమయిన కథనంతో చెప్పి ఉంటె ఒక మంచి చిత్రంగా మిగిలిపోయేది కాగా మన దగ్గర ఉన్న పాయింట్ బాగుంది కదా అని రొటీన్ సన్నివేశాలను ఎంచుకొని వాటితో కథనాన్ని అల్లుకోవడం నిజంగా దురదృష్టకరం నీలకంట లాంటి దర్శకుడి నుండి ఇటువంటి చిత్రాన్ని అయితే ఎవరూ ఊహించరు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా మొదలయ్యి అటు నుండి రోమాన్స్ లో కి వెళ్లి అక్కడి నుండి క్రైమ్ థ్రిల్లర్ గా ముగిస్తుంది.ఇది ఒక సైకాలజీ థ్రిల్లర్ గా నే నడిపించి అలానే ముగించి ఉంటె బాగుండేది. కథ మొత్తం అవంతిక పాత్ర చుట్టూ తిప్పి ఉండాల్సింది అవంతిక జీవితంలోకి వచ్చే వ్యక్తుల వలన ఆమె ఎదుర్కునే పరిస్థితుల మీద దృష్టి సారించి ఉండాల్సింది అది కాకుండా ఆమె జీవితంలోకి వచ్చే వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనల మీద దృష్టి పెట్టారు.

గతంలో ఈ దర్శకుడు చేసిన చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా నాసిరకమయిన ఫలితం అనే చెప్పాలి ఎందుకంటే అయన అనుకున్న విషయాన్నీ చెప్పడంలో ఇప్పటి వరకు విఫలం అవ్వలేదు కాని మొదటి సారి ఎలా చెప్పాలో తెలియక తడబడినట్టు తెలిసింది. ఇక కేసు ముసేసాక కూడా సుష్మ నేరస్తురాలని పోలీస్ లకి ఎలా తెలిసింది? అసలు అవంతిక ఎప్పటికి కలవని నందిని రాయ్ పాత్రను ఎలా చూడగలిగింది? ఆమెకు ఉన్న ఈ ఎస్ పి చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా కనిపించి ఉండదా? వంటి ప్రశ్నలకు చిత్రంలో సమాధానాలు దొరకవు..మొదటి పది నిమిషాల పాటు చిత్రంలో ఏదో ఉంది అన్న ఊహ సృష్టించడంలో దర్శకుడు విజయం సాదించాడు కాని చిత్రం సాగుతున్న కొద్దీ సాఆఆగుతున్న అనుభవం కలుగుతుంది పైగా ఈ చిత్రం చూసే ప్రేక్షకుడు కూడా సిక్స్త్ సెన్స్ అంటే ఏంటో ఫీల్ అవుతాడు ఎందుకంటే తరువాత జరిగే సన్నివేశం ఏంటో యిట్టె అతనికి తెలిసిపోతు ఉంటది కాబట్టి.. మాయ అనే చిత్రం చూడాలా వద్దా అనే విషయం మీ ఇష్టం .. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ కాదు క్రైమ్ థ్రిల్లర్ కాదు.. థ్రిల్లింగ్ గా లేదు కాబట్టి అసలు థ్రిల్లర్ కాదు అని కూడా అనవచ్చు కాని దర్శకుడి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించి చూడండి.. నచ్చే అవకశాలు లేకపోలేదు మరి..

Harshvardhan Rane,Avantika Mishra,Sushma Raj,Neelakanta,Evenki Reddy, Madhura Sridhar,Shekar Chandra.మాయ - మాయ లేదు.. మేటర్ లేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: