సినిమాటోగ్రఫీ,సమంత మరియు తమన్నాల అందాలు.సినిమాటోగ్రఫీ,సమంత మరియు తమన్నాల అందాలు.కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం,పాత కథ,రొటీన్ కథనం,సందర్భానుసారం అంటూ లేని పాటలు,సన్నివేశంతో సంభంధం లేని నేపధ్య సంగీతం,హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ,మొదలుగునవి ....

అల్లుడు శీను(బెల్లంకొండ శ్రీనివాస్) మరియు అతని మామ నరసింహ(ప్రకాష్ రాజ్) బదామి లో నివశిస్తు ఉంటారు.. అక్కడ ఊరంతా అప్పులు చేసి ఉంటాడు శీను .. ఆ అప్పుల నుండి తప్పించుకోవడానికి చెన్నై పారిపోతారు నరసింహ మరియు అల్లుడు శీను చెన్నై చేరుకున్నాక అక్కడి నుండి దుబాయ్ వెళ్లిపోవాలి అనేది వీరి ఆలోచన.. కాని అనుకోని పరిస్థితిలో వారు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ రాగానే అల్లుడు శీను కి భాయ్(ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు.. వెంటనే భాయ్ పేరుని ఉపయోగించుకొని భాయ్ లానే ఉండే నరసింహ తో డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు.. ఇందుకోసం డింపుల్ (బ్రహ్మానందం) ని ఉపయోగించుకుంటాడు. ఇదిలా నడుస్తూ ఉండగా భాయ్ కూతురు అంజలి(సమంత) ని అల్లుడు శీను ప్రేమిస్తాడు. అంజలి కూడా తను పెట్టిన పరీక్షలలో పాస్ అవ్వడంతో అల్లుడు శీను ని ప్రేమించడం మొదలు పెడుతుంది.. భాయ్ మాత్రం తన కూతురు అంజలి ని భాను(ప్రదీప్ రావత్) కొడుకు కి ఇచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి షార్జాలో ఉండటంతో కుటుంబాన్ని అక్కడికి తీసుకెళతాడు... అసలు భాయ్ మరియు నరసింహ కి ఉన్న సంభంధం ఏంటి? అల్లుడు శీను మరియు అంజలి కలిసారా? షార్జాలో ఎవరు ఎవరిని ఎలా పెళ్ల్లి చేసుకున్నారు అన్నది మీరు తెర మీద చూడవలసిన అంశాలు...

బెల్లంకొండ శీను, నూతన నటుడు అనే ఒక్క వెసలుబాటు పక్కన పెడితే పాత్రకి తగ్గ నటన, నటనకి తగ్గ శరీరతత్వం ఉన్నప్పుడే ఎవరయినా పూర్తి నటుడు ఈ రెండింటిలో ఈ నటుడు ఇంకా "అ, ఆ" ల స్థాయిలోనే ఉన్నాడు. మాస్ హీరో గా నిరూపించుకోవాలన్న ప్రయత్నం ఆపేసి వివిధ రకాల పాత్రలను ప్రయత్నిస్తే మంచిది. సమంత, ఈ చిత్రానికి అతి పెద్ద ప్యాడింగ్ ఈ నటి, ఈ నటివలనే ఈ చిత్రానికి కాస్త ఊపు వచ్చింది కాని చిత్రంలో మాత్రం ఈ నటి ఆమె స్థాయి నటన కనబరిచే అవకాశం లేకపోయింది చాలా కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యింది కాని పాటల విషయంలో మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో అందాలను ఆరబోసి ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ , ఈ నటుడు ఈ చిత్రంలో రెండు పాత్రలు చేసాడు రెండు పాత్రలకి మధ్య చాలా స్పష్టమయిన తేడా చూపగలిగారు ప్రకాష్ రాజ్ కాని విలనిజం పూర్తిగా చూపించలేకపోయారు.బ్రహ్మానందం చాలా కొన్ని సన్నివేశాలలో మాత్రమే నవ్వించగలిగారు.. మిగిలిన చోట్ల సన్నివేశాల ప్రభావం అయన నటన మీద చాలా స్పష్టంగా కనిపించింది.. తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్ , వెన్నెల కిషోర్ మరియు మిగిలిన నటులు ఏదో ఉన్నారంటే ఉన్నారు అనే కాని వారి నటనలో మరియు వారి పాత్రలకు ఎటువంటి ప్రత్యేకత లేదు ... స్పెషల్ సాంగ్ లో తమన్నా తన అందాలతో ఆకట్టుకుంది.

కథ అందించిన కే ఎస్ రవీంద్ర , పాత చిత్రాల నుండి ఒక్కొక్క పాయింట్ ని తీసుకొని ఒక వరుసలో అమర్చి కథ అనిపించేసారు. ఇక గోపి మోహన్ -వి వి వినాయక కలిసి అందించిన కథనం కూడా కొత్తగా ఏదొకటి ప్రయత్నించకుండా వారి చిత్రాలే అయిన నాయక్ , రెడీ , అదుర్స్ , ఆది, బన్ని ఇవే కాకుండా గుడుంబా శంకర్, రచ్చ, ఇంద్ర వంటి చిత్రాల నుండి సన్నివేశాలను తీసుకొని చాలా పాయింట్లను కలిపి ఇచ్చిన కథకి సరిపోయేలా అతికించేసారు. ఇవి కొత్తగా లేకపోగా ఆసక్తికరంగా కూడా లేకపోవడం మరింత బాధపడాల్సిన విషయం. కామెడీ కోసం రాసుకున్న సన్నివేశాలు అయితే దారుణం అని చెప్పుకోవచ్చు వీటిని చిత్రంలో ఉంచిన కత్తిరించినా తేడా ఉండదు. దర్శకుడిగా వి వి వినాయక్ పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు. ఆయనకే చెల్లిన కామెడీ విషయంలో కూడా అయన విఫలం అవ్వడం విచారకరం అయిన విషయం. ఎడిటింగ్ అందించిన గౌతం రాజు ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని చాలావరకు కత్తిరించి ఉండవచ్చు చాలా పొడవయిన సన్నివేశాలే కాకుండా అనవసరమయిన సన్నివేశాలు కూడా అధికంగా అగుపిస్తాయి. సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ రెండు పాటలు బానే ఇచ్చిన మిగిలిన పాటలు జస్ట్ ఒకే అనిపించేసారు ఇక నేపధ్య సంగీతంలో చిత్రంతో నాకు సంబంధం లేదు అన్న నిబంధన పాటించినట్టు ఉన్నారు. సన్నివేశం ఒకలా ఉంటె దానికి నేపధ్య సంగీతం మరోలా ఉంటుంది. ఫైట్స్ బాగున్నాయి కాని కాస్త నేల మీద కూడా చిత్రీకరించి ఉండాల్సింది. నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు పెట్టిన ఖర్చు అంతా తెర మీద కనిపిస్తుంది కాని ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకదు .. అంటే అవసరం లేని చోట కూడా అధికంగా ఖర్చుపెట్టారు...

ఇప్పుడు తెర మీదకు వచ్చే ప్రతి హీరో మాస్ హీరో అవ్వాలనే ప్రయత్నిస్తున్నారు వీరందరు ఒక్క విషయం గమనించాలి ఇప్పటికే మన పరిశ్రమలో చాలా మంది మాస్ హీరోలు ఉన్నారు ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం విభిన్న చిత్రాలు చేసి ఆకట్టుకోగలిగే హీరోలు కావాలి మన పరిశ్రమకి. వీరు హీరో కావాలి అనుకుంటున్నారా? లేక నటుడు అవ్వాలి అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు స్పష్టమయిన్స సమాధానం చెప్పగలిగాలి.. ఇది పక్కన పెడితే మాస్ హీరో అయిపోదం మాస్ ని ఆకట్టుకునేద్దాం అని తెర మీదకి వచ్చిన బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అతని నటన మరియు డాన్స్ మరియు డైలాగ్స్ చెప్పే విధానం ఇలా ప్రతీది సగం మాత్రమే కనిపిస్తున్నాయి .. నిజానికి కాస్త కష్టపడి అవి పూర్తిగా నేర్చుకొని తెర మీదకు వస్తే మంచి నటుడు అయ్యే అవకాశం ఉంది.. సమంత వంటి నటిని తీసుకొని కూడా ఆమెతో నటింపజేయక అందాలను ఆరబోయించడం నిజంగా ఆశ్చర్యకరం అయిన విషయం.. ఇక కొందఱు నటులను ఎందుకు తీసుకున్నారో వారు ఏమి నటించారో అన్నది వారికి మరియు చూసే మనకి క్లారిటీ ఉండదు. ఇక ఈ చిత్ర కథనం గురించి వస్తే గుడుంబా శంకర్ లో ని ఆశిష్ విద్యార్ధి ని పోలిన పాత్ర ప్రదీప్ రావత్, రచ్చలో తమన్నా పెట్టినట్టు టెస్ట్ లు పెట్టె సమంత.. రెడీనుండి పెళ్లి సీన్ నాయక్ నుండి మరోటి ఇలా అవే పులిహోర అనిపించే చిత్రాలను తీసుకొని వాటితో మరో రకం పులిహోర చేద్దామనే ప్రయత్నం ఈ చిత్రం.. అసలు ఈ చిత్రంలో లాజిక్ గురించి మాట్లాడితే అసలు బదామి నుండి బయలుదేరి చెన్నై వెళ్ళాల్సిన ట్రైన్ హైదరాబాద్ కి మళ్ళించడం అనేది అంతుపట్టని విషయం.. హీరో షార్జా వెళ్ళాలి అనుకోగానే రెండు రోజుల్లో వీసాలు దొరికేయడం ఈ సినిమాకే చెల్లుతుంది.. అద్దె విమానంలో బయలుదేరిన హీరో కన్నా ముందుగానే విలన్స్ హైదరాబాద్ చేరుకోవడం వంటి అద్భుతం అయిన సన్నివేశాలు ఉన్నాయి ఈ చిత్రం లో ... ఇక రన్ వే మీద విమానాన్ని ఓవర్ టేక్ చేసే జీప్ ల సంగతి సరేసరి.. అన్ని కమర్షియల్ చిత్రలలానే ఈ చిత్రంలోనూ మంచి పాయింట్ ఉంది కాని లేనిదల్ల మంచి సన్నివేశాలు .. ప్రచారం చూసి ఇదేదో గొప్ప మాస్ మసాలా చిత్రం అనుకోని థియేటర్ కి వెళ్తే మోసపోతారు సమంత వీరాభిమాని కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా చూడాలి అనుకుంటేనే థియేటర్ కి వెళ్ళండి..

Bellamkonda Sai Sreenivas,Samantha Ruth Prabhu,V. V. Vinayak,Bellamkonda Suresh,Devi Sri Prasad.అల్లుడు శీను : తెలుగు తెర మీద వండిన మరొక పులిహోర చిత్రం...

మరింత సమాచారం తెలుసుకోండి: