టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేటి సీతమ్మ అంటూ అంజలిని అభిమానులు ముద్దుగా పిలుచుకునే వారు. చాలా మంది బడా హీరోలు సైతం అంజలిని వారి మూవీల్లో తీసుకోవటానికి తెగ పోటీపడ్డారు. అయితే ఇదంతా గతంలో. ఇప్పుడు అంజలిని హీరోయిన్ గా తీసుకోవటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా అంజలి చుట్టు ఉన్న కేసులూ, గొడవలూ వీటి కారణాలతో అంజలికి ఎవరూ ఆఫర్స్ ఇవ్వటానికి ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే అంజలి ప్రస్తుతం కోన వెంకట్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ తప్ప తన చేతిలో ఏ మూవీ లేదు. అంజలి, వీటన్నింటి నుండి బయటపడాలని చూస్తుంది. తాజాగా ఇంటర్నెట్ లో అంజలి చిందులేసిన ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫోటోలను కొందరు ఆకతాయిలు పెట్టారని తను అంటుంది. అంతే కాకుండా తన ఫేస్ బుక్ ఐడిని సైతం బటయకు చెబుతుంది. అంజలి నైట్ పార్టీలో మందు తాగి, అస్యభ్యకరంగా చిందులేసిందనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఆ పార్టీలో జరిగిన తంతుని ఎవరు ఫోటోలు తీసి, నెట్ లో అప్ లోడ్ చేశారనేది ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది. ఇదిలా ఉంటే తిరిగి తను ఫాంలోకి రావటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. డైరెక్టర్స్ ను, నిర్మాతలను కలిసి తనకి ఆఫర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంజలి చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకూ తనని గట్టున పడేస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: