సంగీత దర్శకుడిగా తమన్ కు కెరియర్ బ్రేక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజాను, తమన్ నిన్న జరిగిన పవర్ ఆడియో వేడుకలో తనకు నాన్నగా మార్చుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్న జరిగిన పవర్ ఆడియో వేడుకలో తమన్ మాట్లాడుతూ రవితేజాకు 'అమ్మా నాన్న తమిళమ్మాయి' అయితే తనకు 'అమ్మా నాన్న రవితేజ' అంటూ రవితేజాను ఆకాశానికి ఎత్తేశాడు తమన్.  ఇదే వేడుకకు అతిధిగా వచ్చిన దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ తనకు రవితేజా బావ వరస అంటూ జోక్ చేసి తాను సహాయ దర్శకుడిగా పనిచేసే రోజులలో తాను రాసిన కధలకు మొదటి శ్రోత రవితేజా అని చెపుతూ తాను రాసుకున్న చాల మాస్ కధలు రవితేజాను దృష్టిలో పెట్టుకునే రాసానని అన్నాడు వినాయక్. అంతేకాదు కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో రవితేజా ముందు వరసలో ఉంటాడని మాస్ మహారాజ పై ప్రశంసల వర్షం కురిపించాడు వినాయక్. ‘బలుపు’ సినిమా సూపర్ హిట్ తరువాత ఎన్నో అవకాశాలు రవితేజాకు వచ్చినా ఇచ్చిన మాట కోసం తనతో సినిమాను చేసిన రవితేజా ఋణం తీర్చుకోలేను అని అన్నాడు దర్శకుడు బాబి.  ఇవన్నీ ఇలా ఉంటె ‘పవర్’ సినిమాలో రవితేజా పాడిన ‘నోటంకి నోటంకి’ అనే పాటకు వేదిక పై రవితేజ, హన్సికా బ్రహ్మానందo, తమన్ కలిసి స్టెప్పులు వేసి డాన్స్ చేయడం పవర్ ఆడియో వేడుకకు టాపిక్ ఆఫ్ ది ఈవెంట్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: