సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పెళ్లి వేడుక మంగళవారం నాడు నిరాడంబరంగా జరిగింది. బంధు మిత్రల సమక్షంలో సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్ వివాహ బంధంతో ఒకటయ్యారు. మంగళవారం నాడు సైఫ్ ఇంట్లో జరిగిన ఈ వివాహ వేడుక రిజిస్ర్టేషన్ పధ్ధతిలో జరిగింది. బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న సైఫ్-కరీనాల ఈ పెళ్లి వేడుకతో ఒకటయ్యారు. కాగా, ఈ నెల 18న కరీనా-సైఫ్ ల వివాహ రిసెప్షన్ వైభవంగా జరగనుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: