ఇంకా పంట కోతకు కూడా రాకముందే ‘మిర్చి’ ఘాటు విదేశాల దాకా వ్యాపించేసింది. అవును, ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి ఘాటే. భారీ అంచనాలతో విడుదలైన రెబల్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థతి. రెబల్ ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్ కు మంచి రోజులు ఎప్పడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. వాళ్ల సంగతేమోగానీ... మిర్చి నిర్మాతలకు మాత్రం కాస్త మంచిరోజులు నడుస్తున్నాయనే చెప్పాలి. లేదంటే... విదేశాల్లో ‘మిర్చి’ హక్కులు ఏకంగా రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడమేంటి? రెబల్ కేవలం కోటిన్నర సంపాదిస్తే ఇప్పుడు మిర్చి ఆ రికార్డును తిరగరాసి ప్రభాస్ సినిమాలన్నింటిలోకీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: