ఎదిగే కొద్దీ మనిషి ఆలోచనల్లో మార్పు వస్తూ ఉంటుంది. యువతరంలోనూ అంతే. జీవితంలో అత్యంత కీలకమైన ఈ దశను యువత సంపూర్ణంగా అనుభవిస్తోందా? హద్దులు దాటి దారి తప్పుతోందా? అనే సున్నితమైన అంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'టెన్త్‌లో లక్, ఇంటర్‌లో కిక్, బీటెక్‌లో..?'. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి తిరుపతమ్మ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫిల్మ్ చాంబర్ లో ప్రారంభమైంది. కెమెరాస్వీఛ్చాన్ : ప్రసన్న కుమార్ , క్లాప్ : విజేయందర్ రెడ్డి , ఫస్ట్ షాట్ డైరెక్షన్ : సాగర్ నిర్వహించారు. ఈ సినిమా అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని దర్శకుడు వెంకట్ మంచి తెలిపారు. "నూతన నటీనటులతో పాటు సీనియర్ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. వైవిధ్యమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా.. చక్కటి సందేశాన్ని అందిస్తున్నాం'' అని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలజాశ్రీనివాస్ తెలిపారు.   కథ ,దర్శకత్వం ..వెంకట్ మంచి , ప్రోడ్యూసర్స్ : యం .రామారావు , ఎస్ శైలజ 

మరింత సమాచారం తెలుసుకోండి: