యంగ్ హీరోలు తాము నటించే ప్రతి సినిమాకు డిఫరెంట్ గా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో నందమూరి సింహం బాలయ్య కూడా నేటితరం యంగ్ హీరోలతో పోటీపడి చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ గా మారింది.  బాలయ్య సత్యదేవా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి కావడంలో బాలకృష్ణ వచ్చే సంవత్సరం తన నుంచి రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటూ తన 99వ సినిమా పై అప్పుడే దృష్టి పెట్టేసాడు. ‘లౌక్యం’ సినిమా దర్శకుడు శ్రీవాస్ దర్సకత్వం వహించబోయే ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ లు ఒక డిఫరెంట్ కథను బాలకృష్ణ కోసం సిద్దం చేస్తున్నారు.  ఈ సినిమాలో బాలయ్య డాన్ కనిపించబోతాడని టాక్. అయితే ఈ పాత్రలో బాలయ్య మాఫియా డాన్ గా కనిపించి మెప్పించడానికి తన బరువును బాగా తగ్గాలి అని ఈ సినిమా దర్శకుడు సూచించడంతో బాలకృష్ణ తాను నటించబోయే డాన్ పాత్ర నిమిత్తం 15 కేజీలు బరువు తగ్గడానికి ప్రత్యేకమైన డైట్, నిపుణుల పర్యవేక్షణలో ఎక్సరసైజ్ లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం అక్టోబర్ ప్రాంతంలో ఈ సినిమాను విడుదల చేసి దీనితరువాత 2016లో విడుదల కాబోయే తన 100వ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని పక్కా ప్లాన్ తో బాలకృష్ణ అడుగులు వేస్తూ తాను ఎప్పటికీ టాలీవుడ్ లెజెండ్ అని మరొకసారి రుజువు చేసుకోబోతున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: