రజినీకాంత్ పెర్ఫార్మన్స్,ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ ,సినిమాటోగ్రఫీ రజినీకాంత్ పెర్ఫార్మన్స్,ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ ,సినిమాటోగ్రఫీ సినిమా నిడివి ,పాత కథ ,ఊహించిన కథనం ,డైరెక్షన్ , సాగదీసిన సెకండాఫ్ ,మరీ లాంగ్ అనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది.. 1939 లో కలెక్టర్ అయిన రాజా లింగేశ్వరన్ (రజినీకాంత్) సింగనూర్ ప్రాంతానికి వస్తాడు. అక్కడ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్న లింగేశ్వరన్ ఒక డామ్ కట్టాలి అనుకుంటాడు. కానీ దానికి బ్రిటిష్ వారు ఒప్పుకోరు. దాంతో లింగేశ్వరన్ కలెక్టర్ గా రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత డ్యామ్ ని తన సొంత డబ్బుతో కట్టడానికి నిర్ణయించుకుంటాడు. కానీ తాను అనుకున్న డ్యామ్ ఫినిష్ చేసే సమయానికి కొన్ని సమస్యలు వచ్చి లింగేశ్వరన్ ని ఆ ఊరి నుంచి వెళ్ళగొడతారు. కట్ చేసి ప్రెజెంట్ కి వస్తే ఆ ఊరి ఎంపి అయిన నాగ భూషణం (జగపతి బాబు) ఆ డామ్ ని కూల్చేసి మరో డామ్ కట్టాలనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ డామ్ ని కాపాడటానికి లింగ(రజినీకాంత్) ఎంటర్ అవుతాడు. అసలు ఈ లింగ ఎవరు? లింగకి రాజా లింగేశ్వరన్ కి ఉన్న సంబంధం ఏమిటి.? అసలు ఆ ఊరి ప్రజలు లింగేశ్వరన్ ని ఎందుకు ఊరి నుంచి తరిమేశారు.? లింగేశ్వరన్ ఆ డ్యామ్ కోసం ఏమేమి చేశాడు.? అన్నది మీరు వెండితెరపై చూడాలి...తలైవా సినిమా అన్నాక నటీనటుల్లో మొదటగా రజినీకాంత్ గురించి తప్ప ఇంకెవరి గురించి చెప్పగలం. కింగ్ అఫ్ స్టైల్ అని పిలుచుకునే రజిని ఈ సినిమాలో కూడా చాలా స్టైలిష్ గా కనిపించాడు. అలాగే ఆయన నుంచి కోరుకున్న రెండు మూడు పంచ్ డైలాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటికంటే మించి ఈ సినిమాలో రెండు పాటల్లో రజిని చిన్ని చిన్ని స్టెప్స్ వేసి ఫ్యాన్స్ చేత డ్యాన్సులు వేయిస్తాడు. ఇవన్నీ రజినీ పరంగా ప్లస్ లు అయితే మైనస్ లు పరంగా ప్రతి సినిమాలోనూ రజినీకాంత్ పాత్రకి ఓ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మానరీజం ఉంటుంది. అలాంటిదేమీ ఇందులో ఉండదు. కెఎస్ రవికుమార్ రజిని స్టైల్ ని అలానే చూపించినా ఆయన మానరిజం ని చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే అభిమానులు నిరుత్సాహానికి గురవుతారు.

ఇక అనుష్క ఇందులో చూడటానికి చాలా బొద్దుగా ఉంది. అలాగే పెద్ద కష్టపడి చేసేంత పాత్ర కూడా కాదు. సినిమాలో కాస్తో కూస్తో ప్రాముఖ్యత ఉన్న పాత్ర, దాన్ని చాలా సింపుల్ గా చేసేసింది. రజిని - అనుష్క కెమిస్ట్రీ బాగుంటుంది. ఇక సోనాక్షి సిన్హా పాత్ర కూరలో కరివేపాకు లాంటిది. ఆ పాత్ర ఉన్నా లేకపోయినా సినిమాకి పెద్ద ఉపయోగపడేదేమీ లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోకి ఓ జోడీ కావాలి అందుకే సోనాక్షి ఉంది. పాత్రే లేనప్పుడు పెర్ఫార్మన్స్ మనం ఆశించడం తప్పు.. తన తెలుగు డైలాగ్స్ కూడా అస్సలు సూట్ అవ్వలేదు. జగ్గూ భాయ్ అయిన జగపతి బాబు కథా పరంగా ఈ సినిమాకి విలన్ కానీ తన పాత్ర మొత్తం చాలా చెత్తగా ఉంటుంది. ఓ కామెడీ సినిమాలో కామెడీ విలన్ కన్నా చీప్ గా ఉంటుంది ఆ పాత్ర. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీరియస్ సీన్స్ టైం లో తను చేసే నటన ఆడియన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. జగ్గూ భాయ్ కంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే బ్రిటిష్ విలన్ పెర్ఫార్మన్స్ సూపర్బ్ గా ఉంది. ఇకపోతే కమెడియన్ సంతానం చెప్పే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇక కె విశ్వనాథ్, విజయ్ కుమార్ తదితరులు తమ వరకూ న్యాయం చేసారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన వారు మరియు ఆ పోసిన ప్రాణాన్ని నిర్దాక్షన్యంగా తీసేసినవారు ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. ముందుగా ప్రాణం పోసిన వారెవరో చెబుతా.. ఫస్ట్ పర్సన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. తను చాలా కష్టమైన లోకేషన్స్ లో కూడా షూట్ చేసి చాలా బాగా చూపించాడు. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్ప మిగతా అంతా విజువల్ గా చాలా బాగుంటుంది. ఆ తర్వాత చెప్పాల్సింది ఆర్ట్ డైరెక్షన్ టీం.. సనత్ ఈ సినిమాలో వేసిన సెట్స్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి, అవి లేకపోతే సినిమానే లేదని చెప్పాలి. సినిమాలో ఊహించిన దానికంటే సెట్టింగ్స్ (ఆర్ట్) వర్క్ చాలా అద్భుతంగా వేశారు. ఇది సినిమాకు చాలా హెల్ప్ అయ్యిందనే చెప్పొచ్చు. ఇక ఎఆర్ రెహమాన్ అందించిన పాటలు తుస్సుమన్న సంగతి మనకు తెలిసిందే, కానీ విజువల్ గా మాత్రం బాగా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే అనేలా మాత్రమే ఉంది. అంటే రెహమాన్ లాంటి వారే ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చారని చెప్పాలి. ఇక్కడి నుంచే ఈ సినిమా ప్రాణం తీసేవాళ్ళు మొదలయ్యారు. ఎఆర్ తర్వాత ఎడిటర్ సంజిత్ సినిమాని తన ఎడిటింగ్ తో పడుకోబెట్టేసాడు. ఎక్కడైనా కొంచెం స్పీడప్ చేసి, ఆడియన్స్ లో ఊపు తీసుకొద్దామనే ఆలోచనే లేకుండా ఈ సినిమాని ఎడిట్ చేసాడు.

ఇక పొన్ కుమరన్ - రవికుమార్ కలిసి రాసుకున్న ఈ కథ మనం 1980ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇందులో కొత్త అని చెప్పడానికి ఏమీ లేకపోగా తెలుగు సినిమాల్లో కనిపించిన సీన్స్ ని మక్కికి మక్కి కూడా దించేసారు. కథ పాతదే అనుకున్న కథనం అన్నా కొత్తగా రాసుకోవాలిగా, అలా చేయకపోగా అనవసరమైన సీన్స్ అన్ని పెట్టి సాగదీసారు. ఇక్కడ డైరెక్టర్ తెలుసుకోవాల్సింది ఏమనగా తలైవా సినిమాకి కూడా పాడింగ్ ఎందుకు సార్... కెఎస్ రవికుమార్ డైరెక్టర్ గా అభిమానులకు నిరాశనే మిగిల్చాడు. రజినితో ముత్తు, నరసింహా లాంటి సినిమాలు తీసిన రవికుమార్ కే రజినితో ఎలాంటి సినిమా తీయాలో తెలియకపోతే ఏం చెబుతామ చెప్పండి.. అందుకే ఏమీ అనకుండా వదిలేస్తున్నా కానీ ఒక్క మాట చెబుతా.. కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇక రాక్ లైన్ వెంకటేష్ పెట్టిన రూపాయలు మాత్రం రిచ్ గా స్క్రీన్ పై కనిపిస్తాయి. 'రోబో' లాంటి సినిమా తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని రజినీకాంత్ నటించిన 'లింగ' సినిమాపై కోటి ఆశలతో అభిమానులు ఈ రోజు థియేటర్స్ కి వెళ్ళారు. వాళ్ళందరి ఆశల్ని వేళ్ళతో సహా నరికేసేలా ఈ సినిమా తీసారు. కేవలం రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్స్ అనుకునే వారికి మాత్రమే ఈ సినిమా కాస్త నచ్చే అవకాశం ఉంది. మిగతా వారందరికీ ఈ సినిమా అస్సలు నచ్చదు. ఈ సినిమా అంతా చూసాక ఆడియన్స్ డైరెక్టర్ ని ఎందుకు తిడతారు అంటే.. రజినీకాంత్ సినిమా అనగానే ఓ డిఫరెంట్ మానరిజం, కొన్ని పంచ్ డైలాగ్స్, ఆయన డిఫరెంట్ స్టైల్స్ ఏమీ ఇందులో ఉండవు. అవన్నీ లేకుండా రజిని సినిమా ఎలా ఊహించుకోగలమో చెప్పండి. ఇకపోతే రజినీకాంత్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని చీప్ గా పాడింగ్ కామెడీ, కమెడియన్స్ ని పెట్టడం, కొన్ని అనవసరపు సీన్స్ పెట్టడం ఆడియన్స్ కి చికాకు తెప్పిస్తుంది. కేవలం రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్స్ అనుకున్న వారు మాత్రం ఈ సినిమా నుంచి కాస్త బెటర్ ఫీల్ తో బయటకి రాగలరు, మిగతా వారంతా మూడు గంటల్లోనే సాయంత్రానికి వాడిపోయిన పువ్వులా, నాలుగు రోజుల నుంచి తిండిలేని వాడిలా నీరసంగా, అలాగే కొంతమంది అయితే బ్రతుకు మీద ఆశలేని వారిగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. Rajinikanth,Anushka Shetty,Sonakshi Sinha,K. S. Ravikumar,Rockline Venkatesh,A. R. Rahman.పంచ్ లైన్ : లింగ - అభిమానుల ఆశలను నరికేసిన ఓ నిరాశ.!

మరింత సమాచారం తెలుసుకోండి: