మైక్ రియాన్... ప్రిన్స్ మహేష్ ఇంత అందంగా, ఆరోగ్యంగా, ఫిజికల్ గా ఫిట్ గా ఉండటంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి. మహేష్ కి ఫిజిక్ ట్రెయినర్. షూటింగ్ లలో ఎప్పుడూ మహేష్ వెంటే ఉంటాడు. ఇప్పుడు సుకుమార్ సినిమా షూటింగ్ కి గోవా వెళ్లాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ముంబై భామ క్రుతి. మహేష్ ఫిట్ నెస్ నూ అతడి ట్రెయినర్ నూ చూసి ఆశ్చర్యపోయిందట ఈ ముద్దుగుమ్మ. వెంటనే మైక్ తో స్నేహం మొదలుపెట్టిందట. ‘నేను మైక్ దగ్గర ఫిట్ నెస్ రహస్యాలు తెలుసుకుంటున్నాను. అతడు ఎన్నో సూచనలూ సలహాలూ ఇస్తున్నాడు’ అంటోంది. అతగాడు ఏం చూపాడో... అదే, చెప్పాడో... ఈ గుమ్మడు ఏం చూసిందో అదేనండీ... చేసిందో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: