అవును, ఇది జూనియర్ ఎన్టీయార్ కి ఓ నిర్మాత కట్టిన విలువ. దానయ్య... అంటే దారినపోయే దానయ్యకాదు, డీవీవీ దానయ్య. టాలీవుడ్ లో భారీ నిర్మాతల్లో ఒకరు. జూనియర్ ఎన్టీయార్ తో దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాడట. అందులో నటించడానికి దానయ్య ఎన్టీయార్ కు ఇస్తానన్న పారితోషికం రూ.15 కోట్లు. ఈ చిత్రానికి... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరవాత శ్రీకాంత్ ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాడని అంటున్నారు. ఇదంతా జరిగితే... తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో జూ.ఎన్టీయారే అవుతాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: