ధనుష్ పెర్ఫార్మన్స్ ,అమలా పాల్ క్యూట్ లుక్స్ ,అనిరుధ్ మ్యూజిక్ ,వేల్రాజ్ టేకింగ్ మరియు సినిమాటోగ్రఫీధనుష్ పెర్ఫార్మన్స్ ,అమలా పాల్ క్యూట్ లుక్స్ ,అనిరుధ్ మ్యూజిక్ ,వేల్రాజ్ టేకింగ్ మరియు సినిమాటోగ్రఫీ విలన్ పాత్ర,సెకండాఫ్ అక్కడక్కడా స్లో అవ్వడం ,తెలుగులో ఫెయిల్ అయిన సాంగ్స్ ప్లేస్ మెంట్ప్రతి సంవత్సరం ఎన్నో కలలతో తమ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చి సరైన జాబ్ కోసం ఎదురు చూసే వారిలో మన హీరో రఘువరన్(ధనుష్) కూడా ఒకడు. బిటెక్ పూర్తి చేసుకొని 4 సంవత్సరాలైనా రఘువరన్ మాత్రం తనకి ఇష్టమైన సివిల్ ఇంజనీర్ మాత్రమే చేస్తానని, అదే జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. దానివల్ల రోజూ ఇంట్లో పలు అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. ఆ ఖాళీ టైంలోనే పక్కింట్లో దిగిన శాలిని(అమలా పాల్)తో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ఓ కారణం వల్ల రఘువరన్ కి తను కోరుకున్న జాబ్ వస్తుంది. అలాగే ఓ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా వస్తుంది. అప్పుడే రఘువరన్ ని అడ్డుకోవడానికి ఓ ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అయిన అశోక్ వర్మ (అమితాష్ ప్రధాన్) ఎంటర్ అవుతాడు. అంతటి బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి రఘువరన్ ఏం చేసాడు.? అసలు ఆశిక్ వర్మకి రఘువరన్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు.? అలాగే ఉద్యోగమే రాని రఘువరన్ కి జాబ్ ఎలా వచ్చింది అనేది మీరు వెండితెరపైనే చూసి ఎంటర్టైన్ అవ్వాలి..డైరెక్టర్ అనుకున్న కథకి పూర్తి న్యాయం జరిగి, ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించాలి అంటే నటీనటులు,టెక్నీషియన్స్ ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడమే కాకుండా అద్భుతమైన నటనని కనబరచాలి. అలాంటి నటీనటులే వేల్రాజ్ రాసుకున్న ఈ రఘువరన్ బిటెక్ సినిమాకి దొరికారు. నటనలో రోజు రోజుకీ ఒక్కో మెట్టు పైకెక్కుతున్న తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉద్యోగం లేని కుర్రాడి పాత్రలో యువతని తనవైపు తిప్పుకున్నాడు. సెకండాఫ్ లో అటు ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకునేలా పెర్ఫార్మన్స్ చేసి తన టాలెంట్ ఏంటనేది మరోసారి నిరూపించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనుష్ ఈ మూవీకి హీరో కాకపోయి ఉంటే బంగారం లాంటి ఈ స్క్రిప్ట్ బూడిదలో పోసిన పన్నీరయ్యేది. డబ్బింగ్ వెర్షన్ అయిన తెలుగులో ధనుష్ పాత్రని చెడగొట్టింది ఏదన్నా ఉంది అంటే అది డబ్బింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సీన్స్ లో సరిగా చెప్పలేదు. తెలుగులో అందాలు ఒలకబోసే పాత్రల్లో కనిపించిన అమలా పాల్ ఈ సినిమాలో పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనిపించేలా ఉండే పక్కింటమ్మాయిలా కనిపించింది. తన క్యూట్ లుక్స్, రొమాంటిక్ సీన్స్ లో తన ఎక్స్ ప్రెషన్స్ యువతని మైమరపిస్తాయి. ఈ సినిమాలో సురభి చేసింది చిన్న పాత్ర. నటన పరంగా ఆమె చెయ్యడానికి ఏమీ లేదు కానీ ఉన్నంతలో లుక్స్ పరంగా చాలా అందంగా కనిపించింది. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అమితాష్ ప్రధాన్ పెర్ఫార్మన్స్ బానే ఉంది కానీ పాత్రలోనే సరైన దమ్ము లేదు. తమిళ కమెడియన్ వివేక్ సెకండాఫ్ లో కాస్ట్ నవ్విస్తాడు, వివేక్ కి ఉత్తేజ్ చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సరిపోయింది. ఇకపోతే సీనియాస్ నటులైన సముద్రఖని, శరణ్యలు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమా అనే షిప్ కి కెప్టెన్ గా పిలుచుకునే డైరెక్టర్ ఒక్కడు తనకేం కావాలి అనేవిషయంలో సరైన క్లారిటీతో ఉంటే ఆ సినిమాకి మిగతా అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. అలాగే ఈ సినిమాకి సెట్ అయ్యాయి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనిరుధ్ మ్యూజిక్. తెలుగులోకి డబ్ చేసిన అనిరుధ్ ఆల్బం పెద్దగా మెప్పించలేదు కానీ నేపధ్య సంగీతం మాత్రం ఆడియన్స్ లో పూనకాలు వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా ధనుష్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో అనిరుధ్ మ్యూజిక్ అరాచకంగా అనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ తర్వాత సినిమాకి హైలైట్స్ అయిన కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అనే 4 విభాగాలను డీల్ చేసింది ఒక్కడే., అతనే వేల్రాజ్.. ప్రస్తుతం సొసైటీలో కన్స్ట్రక్షన్ అనే సెక్టార్ లో జరుగుతున్న మోసాల్ల్ని బేస్ చేసుకొని రాసుకున్న పాయింట్ ని ఎంతో ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. కథలో వేల్రాజ్ చేసిన మిస్టేక్ ఒకటే ఎంతసేపూ హీరోని స్ట్రాంగ్ గా చూపించాడే తప్ప హీరోకి పోటీ ఇచ్చే విలన్ హీరో కంటే స్ట్రాంగ్ గా ఉండాలి, చూపించాలి అనే లాజిక్ ని మిస్ అయ్యాడు. ఇక స్క్రీన్ ప్లే పరంగా సెకండాఫ్ లో ఫాస్ట్ గా వెళ్తున్న సినిమా అక్కడక్కడా సడన్ గా స్లో అయ్యి ఫస్ట్ గేర్ కి వచ్చి మళ్ళీ టాప్ గేర్ కి వెళ్తుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అయిన రెండు డిపార్ట్ మెంట్స్ లో తను కష్టపడుతూ, అందరినీ ముక్కుపిండి మరీ వర్క్ చేయించుకొని ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. ఇక రాజేష్ కుమార్ ఎడిటింగ్ చాలా డీసెంట్ గా ఉంది. ఇక తెలుగులో తిరుమల కిషోర్ రాసిన డైలాగ్స్ ఓవరాల్ గా బానే ఉన్నయని చెప్పాలి ఎందుకంటే.. కొన్ని చోట్ల అతిచేసి ఒరిజినల్ కంటెంట్లో ఉన్న ఫీల్ ని మిస్ చేసాడు. కానీ ఎక్కువభాగం బాగానే రాసాడు. అందువల్లే చాలా చోట్ల కామెడీ కోడా వర్క్ ఓఉత్ అయ్యింది. స్రవంతి రవికిషోర్ డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. రఘువరన్ బిటెక్ అనేది తమిళంలో హిట్ అయ్యి తెలుగులోకి వచ్చిన సినిమా.. మన తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే పిచ్చి కావున అది ఎవరి సినిమా అయినా థియేటర్స్ కి వస్తారు. ఆ సినిమా నచ్చిందో ఆ హీరో ఏ భాష అయినా అతన్ని ఆదరిస్తారు. ఎప్పటి నుంచో తెలుగులో మంచి సక్సెస్ కోసం, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న ధనుష్ కలని 'రఘువరన్ బిటెక్' నెరవేర్చింది. ఎందుకంటే ఈ సినిమాలోని కాన్సెప్ట్ భాషతో సంబంధం లేకుండా ఇండియాలోని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండడమే.. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్.. డబ్బింగ్ సినిమాలో చెప్పుకోవాల్సింది డబ్బింగ్ ఎలా ఉందనేది.? ఆ విషయానికి వస్తే సినిమాలో అందరికీ పర్ఫెక్ట్ వాయిస్ లను సెట్ చేసినా హీరో ధనుష్ కి మాత్రం డబ్బింగ్ సరిగా సెట్ అవ్వలేదు. ఎందుకంటే తన పర్సనాలిటీకి, డబ్బింగ్ చెప్పినతని వాయిస్ కి పెద్దగా సెట్ అవ్వదు. సినిమా ఫ్లో వల్ల పెద్దగా తెలియకపోవచ్చు కానీ కీ సీన్స్ అప్పుడు మాత్రం డబ్బింగ్ డబిది దిబిడిగా అనిపిస్తుంది. ఇదొక్కటి తప్ప డబ్బింగ్ పరంగా పెద్ద ఇబ్బందేమీ లేదు. కావున రఘువరన్ బిటెక్ అనే సినిమాని ఈ వారం మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. మా ప్రకారం సినిమాకి రేటింగ్ 2.5 ఇచ్చినా నటీనటుల సూపర్బ్ పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే మీరు మా రేటింగ్ కి ఇంకో .25 ఇవ్వచ్చు. రఘువరన్ బిటెక్ అనేది దర్శకుడి వేల్రాజ్ కథ లేదా ధనుష్ కథ కాదు ...బిటెక్ చదువుకుంటున్న, చదివేసిన వారి కథ. సో డియర్ యూత్ గో అండ్ ఎంజాయ్ 'రఘువరన్ బిటెక్Dhanush,Amala Paul,R.Velraj,Sravanthi Ravi Kishore,Anirudh Ravichander.పంచ్ లైన్ : రఘువరన్ బిటెక్ - టైటిల్లో విలనిజం, లోపలేమో హీరోయిజం..!

మరింత సమాచారం తెలుసుకోండి: