సౌత్ ఆఫ్రికాలో తన కుటుంబ సభ్యులతో కొత్త సంవత్సరం సరదాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన అల్లుఅర్జున్ మళ్ళీ తన సినిమాల పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ తో సినిమాలు తీస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని కోకా పేటలో ఒక మాస్ సాంగ్ ను బన్నీ పై చిత్రీకరిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తీర్చి దిద్దిన ఒక సెట్లో ఈ పాటను బన్నీ పై వెరైటీ స్టెప్స్ తో చిత్రీకరిస్తున్నాడు త్రివిక్రమ్.  అయితే ఫిబ్రవరి 5వ తారీఖున విడుదల అవుతుంది అనుకున్న ఈసినిమా ఏప్రియల్ 2వ తారీఖుకు వాయిదా పడటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఇప్పటికే చాల భాగం చిత్రీకరణ పూర్తి అయిపోయిన ఈసినిమా వాయిదా వెనుక గల కారణాల పై రకరకాల ఊహగానలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బన్నీ ఈ సినిమా విషయంలో వెనుకంజ వేయడం వెనుక జూనియర్ ‘టెంపర్’ ప్రధాన పాత్ర పోషించింది అని టాక్. ఫిబ్రవరి మొదటి వారాన్ని టార్గెట్ చేసుకుని వస్తున్న జూనియర్ ‘టెంపర్’ స్పీడ్ ముందు అనవసరంగా ఈ సినిమాను పోటీకి రావడం మంచిది కాదు అన్న అభిప్రాయంతో బన్నీ వెనక్కు తగ్గాడు అనే మాటలు కూడా ఉన్నాయి. ఏమైనా బన్నీ మాస్ స్టెప్స్ తో కోకా పేట అదిరిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: