మామూలుగా కొత్త హీరోయిన్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకటీ... వస్తూనే ఎక్స్ పోజింగ్ చేస్తూ గ్లామర్ తార ఇమేజ్ దక్కించుకుంటారు. రెండు... తొలి పరిచయంలో ఎక్స్ పోజింగ్ చేయాల్సి అవసరం లేకపోవచ్చు. ఆ సినిమా హిట్ అయితే... ‘ఛీ ఛీ నేను అందాల ప్రదర్శనకు ఒప్పుకోను’ అంటూ తెగ బిల్డప్పులు ఇచ్చేస్తారు. సక్సెస్ ఉన్నంతకాలమే ఈ బెట్టు చెల్లుతుంది. సినిమాలు తగ్గిపోయి... కాల్ షీట్లు ఖాళీ అవుతుంటే... ఆటోమెటిగ్గా క్యారెక్టర్ డిమాండూ పెరిగిపోతుంది. మూడో రకమూ ఉంటారని అనుష్కని చూస్తే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు సెక్సీగా కనిపిస్తూనే... ఛీ ఛీ నేనలాంటి పాత్రలు చెయ్యను అనేస్తుంటుంది. అనుష్కకి మొదట్నుంచీ గ్లామర్ తార ఇమేజే. ‘అరుంధతి’ సూపర్ హిట్ తరువాత కాస్త మారింది. కొన్నాళ్లపాటు ‘అలాంటి దుస్తులు నేను ధరించను. క్యారెక్టర్ డిమాండ్ చేసినా ఎక్ప్ పోజ్ చేయన’ని కాస్త ఫోజు కొట్టింది. వెంటనే బిల్లాలో బికినీ వేసేసింది. అదెంటమ్మా అంటే... ‘బిల్లా’ ప్రతిష్టాత్మక చిత్రం అంది. సరే... ‘డాన్’ చిత్రానికి ఓ చరిత్ర ఉంది కాబట్టీ ఓకే అనుకుందాం. ఇప్పుడు మళ్లీ మరోసారి భారీ స్థాయిలో అందాల ఆరబోతకి సిద్ధపడుతోంది. ఇందులో బికినీలూ గికినీలూ కాదు... ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా అవసరమైన చోటు ఆకులు మాత్రమే అడ్డుపెట్టుకుని కనిపించనుందని హాట్ న్యూస్. ఓ తమిళ చిత్రంలో ఇలా కనిపించేందుకు ఒకే అందిట అనుష్క. ఇప్పుడు కూడా అదే మాట... ‘క్యారెక్టర్ బాగా డిమాండ్ చేస్తోంది. పైగా ఇదో చారిత్రక చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’ అంటోదట. డిమాండ్ పెంచుకోవాలంటే ఇలాంటి ‘డిమాండ్’లకు ఓకే అనాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: