మైండ్ బ్లోయింగ్ విజువల్స్ , ఎఆర్ రెహమాన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ , విక్రమ్ అద్భుతమైన నటన , అమీ జాక్సన్ గ్లామర్ , కళ్ళను అబ్బురపరిచే ముత్తు రాజ్ ఆర్ట్ వర్క్ .మైండ్ బ్లోయింగ్ విజువల్స్ , ఎఆర్ రెహమాన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ , విక్రమ్ అద్భుతమైన నటన , అమీ జాక్సన్ గ్లామర్ , కళ్ళను అబ్బురపరిచే ముత్తు రాజ్ ఆర్ట్ వర్క్ .సెకండాఫ్ ,సాగదీసిన రన్ టైం , ఊహాజనితమైన స్క్రీన్ ప్లే , కథలో కిక్ లేకపోవడం , శంకర్ మార్క్ కనిపించకపోవడం , అంచనాలను పెంచేయడం, లాజికల్ గా చాలా మిస్ అవ్వడం. లింగేశ్వర్(విక్రమ్) సనత్ నగర్ లో ఒక జిమ్ పెట్టుకొని ఎప్పటికైనా మిస్టర్ ఇండియన్ బాడీ బిల్డర్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. అందులో భాగంగా లింగేశ్వర్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ టైటిల్ కూడా గెలుచుకుంటాడు. కానీ లింగేశ్వర్ ఇండియాలోనే టాప్ మోడల్ అయిన దియా(అమీ జాక్సన్)కి పెద్ద ఫ్యాన్. అనుకోకుండా ఓ రోజు డాక్టర్ వాసుదేవర(సురేష్ గోపి) వలన ఒకసారి ఆమెని కలిసే అవకాశం వస్తుంది. కట్ చేస్తే మోడలింగ్ లో తన పార్టనర్ అయిన జాన్(ఉపేన్ పటేల్) అమీ జాక్సన్ ని సెక్సువల్ గా వేధిస్తూ ఉంటాడు. అందుకే తనని కాదని లింగేశ్వర్ ని సరికొత్త మోడల్ గా తయారు చేసి దియా లింగేశ్వర్ తో కలిసి ఓ యాడ్ చేస్తుంది. దాంతో వారిద్దరూ ఫేమస్ అవ్వడమే కాకుండా ప్రేమలో కూడా పడతారు. అలా ప్రేమలో పడిన వారు పెళ్లి చేసుకోవాలనుకునే టైంలో లింగేశ్వర్ కి ఓ అంతు పట్టని వ్యాధి వచ్చి రోజు రోజుకీ కురూపిలా మారిపోతాడు.. అది తనకు వచ్చిన జబ్బు అని ఇక తను బతికి ఉన్నా లాభం లేదని చనిపోవాలనుకునే టైములో లింగేశ్వర్ కి ఓ నిజం తెలుస్తుంది.ఆ నిజం ఏమిటి.? లింగేశ్వర్ కి వచ్చింది నిజంగా జబ్బేనా లేక వేరే ఏమైనానా.? అసలు లింగేశ్వర్ ని ఎవరెవరు కలిసి అలా చేసారు.? అసలు ఎందుకు చేసారు.? అనేది మీరు వెండితెరపైనే చూడాలి. ఒక సినిమా కోసం అమాంతం వెయిట్ పెరగడం అలాగే పూర్తిగా సన్న బడిపోవడం లాంటి రిస్కీ స్టెప్స్ తీసుకోవడం ఒక్క విక్రమ్ కి మాత్రమే దక్కింది. విక్రం ఈ సినిమాలో కనిపించే మూడు డిఫరెంట్ లుక్స్ కోసం మూడు విధాల బాడీ షేప్ తో కనిపిస్తారు. అందులో ఒక్కో దాన్లో అతనెలా ఉన్నాడనేది చెప్తాను. బాడీ బిల్డర్ గా అసలు ఈ ఏజ్ లో అంత పర్సనాలిటీ ఎలా చూపించగలిగాడా అనే షాక్ కి గురి చేస్తూ ఓ మాస్ క్యారెక్టర్ లో బి, సి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక రెండవది మోడల్ గా చాలా స్లిమ్ గా కనిపిస్తూ కుర్రకారుకి, అమ్మాయిలకు కళల రాకుమారిడిలా కనిపిస్తాడు. ఈ రెండు పెద్ద కష్టం కాదు కానీ అతను చేసిన అష్టావకుడి(కురూపి) పాత్ర కోసం తను చేలా కష్టపడ్డాడు. పూర్తిగా సన్నబడిపోయి, ఓ భారీ మేకప్ వేసుకొని చాలా కష్టపడి చేసాడు. ముఖ్యంగా ఆ గెటప్ లో విక్రమ్ పలికించిన హావభావాలు సింప్లీ సూపర్బ్. ఇకపోతే చివరిగా బీస్ట్(తోడేలు) పాత్ర అందరినీ టెంప్ట్ చేసినా సినిమాలో మాత్రం ఓ పాటలో వచ్చి అలా వెళ్ళిపోతుంది. అందరూ ఆ క్యారెక్టర్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేస్తుందేమో అనుకుంటారు, కానీ ఆ విషయంలో డైరెక్టర్ బాగా నిరాశపరిచాడు. ఓవరాల్ గా విక్రమ్ పెర్ఫార్మన్స్, రిస్కీ స్టంట్స్, స్టన్నింగ్ లుక్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఇక విక్రమ్ తర్వాత అంత కీ రోల్ చేసింది అమీ జాక్సన్.. అమీ జాకాసన్ పెర్ఫార్మన్స్ చెప్పుకునేంత లేదు.. ఎందుకంటే తనకి ఉన్న సీన్స్ లో సగం సీన్స్ కి న్యాయం చేసింది, సగం సీన్స్ కి చేయలేకపోయింది. ఇకపోతే సినిమాలో మోడల్ కావడం వలన విచ్చల విడిగా అందాలను ఆరబోసింది. ఈ అందాల విందు అన్ని సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. మలయాళ యాక్టర్ సురేష్ గోపి చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే ఉపేన్ పటేల్ ఒక మోడల్ గా చాలా స్టైలిష్ గా ఉన్నాడు, అక్కడక్కడా నెగటివ్ షేడ్స్ బాగానే చూపించాడు. ఇక ఒరిజినల్ స్టైలిస్ట్ మరియు గే అయిన ఓజస్ రజిని చేసిన గే రోల్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. చెప్పాలంటే ఈ పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారనిపిస్తుంది. సంతానం అక్కడక్కడా కొన్ని సెటైరికల్ పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను బాగానే నవ్వించాడు. ఇక మిగతా వారు కూడా తమ పాత్రకి కుదిరినంతవరకూ న్యాయం చేసారు. ఒక హై ఎండ్ విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మరియు టెక్నికల్ సినిమా అంటే హాలీవుడ్ వారీ తీయాలి, అక్కడే అలాంటి సినిమాలు చూడగలం అనే వారంతా ముక్కున వేలేసుకునేలా చేసే సినిమా 'ఐ'. ఇలా హై టెక్నికల్ వాల్యూస్ తో, విజువల్ వండర్ గా ఓ సినిమాని మన సౌత్ డైరెక్టర్ తీసాడని గర్వంగా చెబుతూ 'ఐ' సినిమా టీంకి హ్యాట్సాఫ్ చెబుతున్నాం.

అనుకున్న కంటెంట్ లో దమ్ములేకపోయినా సినిమాని కాస్తో కూస్తో బతికించి ముందుకు నడిపించడమే కాకుండా, థియేటర్స్ లో ఆడియన్స్ కి కాస్త ఊరట కలిగించింది మాత్రం కొన్ని టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ సూపర్బ్ వర్క్ అని చెప్పాలి. ముందుగా మనకు తెరపై కనిపించేది విజువల్స్ కావున పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ విషయానికి వద్దాం.. ఆయన ప్రతి ఫ్రేం ని సంక్రాంతికి మన ఇల్లు గొబ్బెమ్మలు, ముగ్గులు, పచ్చతోరణం మావిడాకులతో కళకళలాడుతూ ఉంటుంది. అలానే విజువల్స్ ని చాలా అందంగా చూపించాడు. ముఖ్యంగా చైనాలోని బ్యూటిఫుల్ లోకేషన్స్ ని అద్భుతంగా చూపించారు. అలాగే విక్రమ్, అమీ జాక్సన్ లను ఎంతో బ్యూటిఫుల్ గా చూపించాడు. సినిమా అంతా ఒక ఎత్తైతే పాటల్లో ఆయన చూపిన విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ డిపార్ట్ మెంట్ వర్క్ సింప్లీ సూపర్బ్. ఇవి కనుక సరిగా లేకపోయి ఉంటే సగంలోనే సినిమాలో నుంచి లేచి వచ్చేయాలి అనిపిస్తుంది. ఈ విజువల్స్ కి ఎఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. ఆంథోని ఎడిటింగ్ మెప్పించే రీతిలో లేదు, చాలా చోట్ల జర్క్స్, ఎందుకు బాబు ఇంతలా సాగదీస్తున్నావ్ అనే ఫీలింగ్ ని ఆడియన్స్ లో కలుగజేస్తుంది. ఇక అనల్ అరసు, పీటర్ మింగ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మెప్పించదగిన స్థాయిలో లేవు. ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాయి..

ఇక డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే.. శంకర్ కి కొత్త రకమైన సినిమాలు చెయ్యాలనే జిజ్ఞాస పోయి ఓ రెగ్యులర్ ఫార్మాట్ కథకి విజువల్స్ గ్రాండ్ జత చేసి చూపిస్తే సరిపోతుంది అని అనుకోని గుడ్డిగా ఈ కథని రాసుకున్నట్టు ఉన్నాడు. ఈ కథలో చెప్పే ఐ అనే వైరస్ పాయింట్ తప్ప మిగతా అంతా మనం ప్రతి వారం చూసే సినిమాల్లో ఉన్న కథే.. కథనం రాసుకోవడంలో శంకర్ కి సురేష్ - బాలకృష్ణన్ తోడైనప్పటికీ ఉపయోగలేకపోయింది. ఈ కథకి 3 గంటల స్క్రీన్ ప్లే అస్సలు అవసరం లేదు. ఇక డైరెక్టర్ గా అద్భుతమైన నటులు చేతిలో ఉన్నప్పుడు పెర్ఫార్మన్స్ లు బాగానే వస్తాయి. అందుకే పెర్ఫార్మన్స్ లు పరంగా శంకర్ ని ఏమీ అనలేము.. కానీ ఓవరాల్ గా ఇది శంకర్ మార్క్ సినిమా అయితే కానే కాదు.. 'ఐ' అంటే అద్భుతం, ఐ అంటే ఆరంభం, ఐ అంటే అందం పేరుకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ఉండటంతో చిత్రంపై ప్రేక్షకులకు విపరీతమయిన అంచనాలు నెలకొన్నాయి అందులోనూ శంకర్ చిత్రం అనగానే అంచనాలు మామూలే. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ ఐ మూవీ దారుణంగా విఫలం అయ్యింది. సమస్య ఎక్కడ వచ్చింది అనేది గమనిస్తే ఈ చిత్రం మొదటి నుండి అసమాంతర కథనంతో నడుస్తుంది. సమాంతరంగా చెప్తూ పోయే కథను అనవసరంగా క్లిష్టతరంగా మార్చి సినిమాని సాదా సీదాగా చేసి ఆసక్తి ని పోగొట్టేసారు. క్లిష్టతరంగా ఉండటం సమస్య కాదు ముందుగానే ఊహించదగ్గ మలుపుని ప్రేక్షకుడి దగ్గర దాచిపెట్టడానికి అసమాంతర కథనాన్ని ఉపయోగించారు. ఇది ఎలా ఉంటుందంటే ఫ్లడ్ లైట్ ల మధ్య దాగుడుమూతలు ఆడినట్టు ఉంది. ఇదే కథను సమాంతరం అయిన కథనం ఉపయోగించి చెప్పి ఉంటే చిత్ర ప్రభావం ప్రేక్షకుడిలో బలంగా నాటుకుపోయి ఉండేది. నాన్ లీనియర్ కథనం ఒక సమస్య అయితే రెండో సమస్య మరొకటి ఉంది ఈ చిత్రానికి మరొక సమస్య కూడా ఉంది అది సమయం, చిత్రం మొత్తం రెండు గంటలు కూడా లేని కథను మూడు గంటలు(అంతకు మించి) చెప్పడం వెనుక శంకర్ గారి ఉద్దేశం ఆయనకే తెలియాలి. ఇది రోమాన్స్ కి రివెంజ్ కి మధ్యన నలిగిపోయిన కథ ఇటు విక్రమ్ మరియు అమీ జాక్సన్ ల మధ్య రొమాన్స్ సరిగ్గా చూపించలేకపోయాడు అటు విక్రమ్ కి ఉన్న ప్రతీకార వాంఛ ను సరిగ్గా చూపించలేకపోయాడు. విక్రమ్ తన శత్రువులపై ప్రతీకారం కోసం ఏదో చేస్తున్నాడు కానీ ఎందుకు? ఈ ప్రశ్న చుట్టూ చిత్రం తిరుగుతుంది కానీ విక్రమ్ పాత్రకి ఉన్న పగ యొక్క గాడతని తెలుపకుండా ఎంత దారుణంగా చూపినా లేదా అంతకూమించి ఏం చేసినా ఫలితం ఉండదు. పైగా తరువాత ఎవరి పై దాడి చేస్తాడో సులభంగా ఊహించెయ్యవచ్చు. ప్రధాన విలన్ ని ట్విస్ట్ గా పెట్టుకున్న దర్శకుడు ఆ విషయం అర్ధం అయ్యేలా ఉండే సన్నివేశాన్ని మొదట్లోనే ఉంచేసాడు కాస్త సినిమా పరిజ్ఞానం ఉన్న ఎవరయినా ఈ మలుపుని ఊహించగలరు. పీసీ శ్రీరాం పనితనం అద్భుతం, ఏఆర్ రహమాన్ మంచి సంగీతాన్ని అందించినా కథాంశం కొత్తదే అయినా కూడా పై మూడు సమస్యల మూలాన చిత్ర ప్రభావం మారడం శోచనీయం. చిత్ర నిడివి తగ్గిస్తే ఒక మోస్తరు చిత్రం అవుతుంధీ. మీరు విక్రమ్,శంకర్ కి వీరాభిమానులు అయితే వెంటనే దగ్గర్లోని థియేటర్ కి వెళ్లండి లేకపోత ఓపిగ్గా చిత్ర్ర నిడివి తగ్గించాక వెళ్లండి..

Vikram,Amy Jackson,Shankar,V. Ravichandran,AR Rahman.పంచ్ లైన్ : ఐ - శంకర్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ప్రోడక్ట్.. అంతకు మంచి రాదేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: