కాన్సెప్ట్ ,ఎండ్ లో ఇచ్చే మెసేజ్ ,మంజునాథ్ డెవలప్ మెంట్ కాన్సెప్ట్ ,ఎండ్ లో ఇచ్చే మెసేజ్ ,మంజునాథ్ డెవలప్ మెంట్ కథనం ,ఎడిటింగ్ ,అక్కడక్కడా మిస్ అయిన డబ్బింగ్ ,పాటల ప్లేస్ మెంట్తెలుగులో వచ్చిన ఫస్ట్ సైబర్ క్రైమ్ మూవీ 'లేడీస్ & జెంటిల్ మెన్'.. ఇది మేము చెప్పింది కాదు ఈ చిత్ర టీం అలా ప్రమోట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక్కో కథని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తా..

అమ్మాయిలంటే బాగా పిచ్చి ఉన్న కాలేజ్ కుర్రాడు కృష్ణ మూర్తి (చైతన్య కృష్ణ). అలాంటి చైతన్య కృష్ణ ఫేస్ బుక్ ద్వారా (దీపు) స్వాతి దీక్షిత్ పరిచయం పెరుగుతుంది. అతి తక్కువ టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలుసుకోవాలి అనుకుంటారు, అలా అనుకున్న తర్వాత ఏం జరిగగింది.?

విజయ్ (మహాత్ రాఘవేంద్ర)కి మనీ అంటే పిచ్చి. ఎలాంటి అడ్డదారుల్లో అయినా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. దానికోసం సోషల్ నెట్వర్క్స్ లోని లూప్ హొల్స్ ని వాడుకుంటాడు. అలా వాడుకొని కొని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.?

చివరిగా ఆనంద్ (కమల్ కామరాజు) - ప్రియ(నిఖిత నారాయణ్) భార్య భర్తలు. కానీ కమల్ ఒక పెద్ద బిజినెస్ మాన్ అవడం వలన భార్యతో సరిగా సమయం గడపడు. అదే టైంలో నిఖిత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన అడవి శేష్ తో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.?

ఇలా 3 కథలకి ఎలాంటి ముగింపు జరిగింది.? అందరూ వారి అనుకున్న దారుల గురించి చివరికి ఏ గమ్యాన్ని చేరుకున్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉన్న 7 మంది నటీనటులు నటించారు. అందులో ఒక్కొక్కరి గురించి సింపుల్ గా కొట్టినట్టుగా చెప్పేస్తా.. కమల్ కామరాజు టాలెంట్ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్.. తనకి ఇచ్చిన పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసాడు. అడవి శేష్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా మెచ్యూర్ గా నటించాడు. క్లాస్ లుక్ లో సాఫ్ట్ ఎమోషన్స్ ని చాలా చక్కగా పండించాడు. ఇక అమ్మాయిల పిచ్చి ఉన్న పాత్రలో చైతన్య కృష్ణ కూడా చాలా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ తమిళ బాబు మహాత్ రాఘవేంద్ర మాత్రం తనని అనుకున్న పాత్రకి అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలి అంటే సినిమాలో అతనొక హాకర్, హాకర్ అన్నవాడి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఎలా ఉంటదన్నా చూపించాలి కదా.. కనీసం హాకర్ లో ఉండే కాన్ఫిడెన్స్ లెవల్స్ ని అన్నా చూపించాలి. కానీ అదికూడా మహాత్ చూపలేకపోయాడు. అలాగే డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు. నిఖితా నారాయణ్ కి మంచి పాత్రే దక్కింది. ఉన్నంతలో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. స్వాతి దీక్షిత్, జాస్మిన్ భాసిన్ లు ఉన్నంతలో తమ వైపు ఆకర్షించగలిగారు. మిగతా వారు తమ పాత్రల్లో అలా వచ్చి వెళ్ళిపోయారు.2012లో హిందీలో వచ్చిన లాగిన్ అనే సినిమాకి ఫ్రీ మెక్ గా వచ్చిన సినిమానే ఈ లేడీస్ అండ్ జెంటిల్ మెన్. సంజీవ్ రెడ్డి రాసిన ఈ కథని అడాప్ట్ చేసుకుని మంజునాథ్ డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఈ సినిమా చేసాడు. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ కథలను చూపించడానికి డైరెక్టర్ ట్రై చేసాడు. చైతన్య కృష్ణ, మహాత్ రాఘవేంద్ర, నిఖిత నారాయణ్ లు ఇంటర్ నెట్ వలన ఎలా సఫర్ అయ్యారనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. చెప్పాలంటే డైరెక్టర్ మంజునాథ్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ కోసం రాసుకున్న కథని చాలా ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా వచ్చేటప్పటికి కొన్ని సీన్స్ ని సరిగా చెప్పలేకపోవడం వలన చూసే వారు ఏంటిది ఐడియా సరిగాలేదే అనే ఫీలింగ్ కి గురవుతారు. చెప్పాలంటే మంజునాథ్ రీమేక్ కాన్సెప్ట్ తో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కాన్సెప్ట్ పరంగా అయితే ఓల్డ్ కాన్సెప్ట్ ని చెప్పాడు.ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ కి ఓల్డ్ పాయింట్స్, సీన్స్, అనవసరమైన కామెడీ ఎప్పుడైతే తోడయ్యాయో అప్పుడే సినిమా చెడింది. డైరెక్టర్ లాజికల్ గా చాలా రీసర్చ్ చేసి ఉండాల్సింది. కనీసం బేసిక్ పాయింట్స్ కూడా మర్చి పోయి తీయడం చాలా లాజికల్ గా కనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరన్నా క్రెడిట్ కార్డ్ వాడితే వాలకి మెసేజ్ వస్తుంది, ఆన్ లైన్ లో ట్రాక్ చేసి ఐపి అడ్రస్ కనుక్కోవచ్చు, మొదలైనవి..ఇక నవీన్ నోలి ఎడిటింగ్ ఓకే డీసెంట్ గానే ఉంది. రఘు కుంచె అందించిన మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంది, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కానీ ఆ పాటలకి సందర్భాలు మాత్రం లేవు. సినిమాటోగ్రఫీ బాగా కలర్ఫుల్ గానే ఉంది. సినిమాకి హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ప్రతి శుక్రవారం వచ్చే ఎన్నో నాశిరకం చిన్న సినిమాలతో పోల్చుకుంటే 'లేడీస్ & జెంటిల్ మెన్' సినిమా బెటర్ గా ఉంది. ఈ సినిమాని అటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటూనే ఓ మెసేజ్ ని చెప్పాలని డైరెక్టర్ ప్లాన్ చేసాడు. ఫస్ట్ హాఫ్ ని బాగానే డీల్ చేసినా సెకండాఫ్ కి వచ్చే సరికి ఫుల్ సీరియస్ సినిమాగా మార్చేసారు. అలాగే సినిమాలో చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, అడవి శేష్ తప్ప మిగతా ఎవ్వరూ ఆశించిన స్థాయి పెర్ఫార్మన్స్ తో మెప్పించలేకపోయారు. ఓ మంచి బోల్డ్ కాన్సెప్ట్ అయిన ఈ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ కాన్సెప్ట్ కి మంచి కథనం, ఎంటర్ టైన్మెంట్, అలాగే పాత్రల మధ్య రిలేషన్ షిప్ ని డెవలప్ చేసి, క్లైమాక్స్ ని ఇంకాస్త కన్విన్స్ అయ్యేలా చెప్పి ఉంటె బాగుండేది. వీటన్నికంటే ముఖ్యంగా టైటిల్ కథకి సరిపోయేలా పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమాకి టైటిల్ కి అస్సలు సెట్ అవ్వలేదు. ఓవరాల్ గా ప్రేక్షకుల చేత పరవాలేదనిపించుకునే ఎంటర్ టైనర్ 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్'. నన్ను అడిగితే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిన సినిమా అయితే కాదు కానీ ఈ వారం రిలీజ్ అయిన వాటిలో ఓ సినిమా చూడాలి అంటే మాత్రం దీనికి వెళ్ళచ్చు. Adivi Sesh, Mahat Raghavendra, Krishna Chaitanya, Kamal Kamaraju, Nikitha Narayana, Swathi Dixit, Jasmin ,PB Manjunath, MVK Reddy.పంచ్ లైన్ : లేడీస్ & జెంటిల్ మెన్ - గుడ్ కాన్సెప్ట్ విత్ రాంగ్ టైటిల్

మరింత సమాచారం తెలుసుకోండి: