ఎన్టీఆర్ , డైలాగ్స్ , కోర్ట్ సన్నివేశం, రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు , నేపధ్య సంగీతం ఎన్టీఆర్ , డైలాగ్స్ , కోర్ట్ సన్నివేశం, రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు , నేపధ్య సంగీతం మొదటి అర్ధ భాగం , వినోదం పాళ్ళు తక్కువగా ఉండటం , బలహీనమయిన పాత్రలు , అసందర్భంగా వచ్చే పాటలు దయా (ఎన్టీఆర్) ఒక అనాథ, సమాజం లో పోలీస్ లు చేసే అవినీతిని దాని ద్వారా వచ్చే లాభాన్ని చూసి ఎలాగయినా తను కూడా పోలీస్ అయితే బాగా సంపాదించవచ్చు అనుకోని కష్టపడి ఎస్ .ఐ అవుతాడు. తనకి కుదిరిన అన్ని పరిస్థితులను ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో వాల్తేరు వాసు(ప్రకాష్ రాజ్) అవినీతి పనులు చేస్తూ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి అడ్డొచ్చిన పోలీస్ ని తప్పించి ఆ స్థానంలోకి దయాని రప్పించుకుంటాడు. దయా మరియు వాసు కలిసి వైజాగ్ లో అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటారు. ఇదిలా సాగుతుండగా దయా జీవితంలోకి ప్రవేశిస్తుంది శాన్వి(కాజల్) . జంతు ప్రేమికురాలు అయిన శాన్విని చూడగానే ప్రేమలో పడిపోతాడు దయా. శాన్విని కూడా తన ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇదే సమయంలో శాన్వి పుట్టిన రోజు కానుకగా ఎం కావాలి అని అడుగుతాడు దయా.. అప్పుడు కాజల్ అడిగిన కానుక వలన దయా జీవితం మారిపోతుంది. ఆ కానుక ఏంటి? ఈ చిత్రానికి లక్ష్మి(మధురిమ) కి ఉన్న సంభంధం ఏంటి అనేది తెర మీద చూడాల్సిందే..ఎన్టీఆర్ , ఒక నటుడికి నటన లోపల ఉంటుదేమో ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ కి చుట్టూ wi-fi లా కనిపించింది. ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలలో ఒక ఎత్తు ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన ఒక ఎత్తు, ప్రతి సన్నివేశంలో అతని ఆటిట్యూడ్ అద్భుతంగా ఉంది. ఇంకా పాటల్లో డాన్స్ కూడా చాలా బాగా చేసాడు. ఫైట్స్ లో కూడా మంచి పవర్ ఫుల్ ఆటిట్యూడ్ కనబరిచారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తన భుజాల మీద నడిపించాడు. పోసాని కృష్ణ మురళి, కథానాయిక కన్నా ముందే ఈ నటుడి గురించి చెప్పుకోడానికి ఒక కారణం ఉంది. కథానాయిక కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అంతే కాకుండా ఎక్కువసేపు కనిపించే పాత్ర కూడా ఇదే. పోసాని కృష్ణ మురళి మరియు ఎన్టీఆర్ మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బాగా రాసుకున్నారు దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కూడా చాలా బాగా నటించి సన్నివేశాలను నిలబెట్టారు. కాజల్ పాత్ర ఈ చిత్రంలో అంత ముఖ్యం కాదు , కాజల్ చెయ్యడానికి పెద్దగా ఆస్కారం లేదు పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. కాని పాటల్లో ఎన్టీఆర్ పక్కన డాన్స్ చెయ్యడానికి ఇబ్బంది పడినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. మధురిమ ఉన్న కాసేపు ఆకట్టుకునేలా నటించింది. ప్రకాష్ రాజ్ వేసింది విలన్ పాత్ర అయినా చాలా సన్నివేశాలలో నవ్వించారు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ - ఎన్టీఆర్ - జయప్రకాశ్ రెడ్డి ల మధ్యన వచ్చిన సన్నివేశాలు చాలా నవ్వించాయి. పవిత్ర లోకేష్ మరియు తనికెళ్ళ భరణి పత్రాలు ఆకట్టుకున్నాయి. సుబ్బరాజ్ మరియు అజయ్ పాత్రలు బాగున్నాయి. మిగిలిన వారందరు వారి పాత్రలకు తగ్గట్టు కనిపించి ఆకట్టుకున్నారు.ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ, కొత్తది అనడానికి ఏమి లేదు ఇందులో ఇప్పటికే పలుమార్లు చూసిన కథనే కాని కథనం విషయంలో కొత్తదనం తీసుకొచ్చారు , కొత్తదనం అంటే సన్నివేశాలలో కాదు దయా అనే పాత్రను సృష్టించి దానికి కాస్త ఆటిట్యూడ్ ని జత చేసి రొటీన్ సన్నివేశాలలో పడేసారు. దీంతో చిత్ర దృక్పధం మారిపాయింది ఈ చిత్రానికి సహాయపడిన ప్రధానాంశం ఇదే. ఇకపోతే మాటలు గురించి మాట్లాడుకునే ఈ చిత్రంలో పూరి మార్క్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సన్నివేశంలో డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉండటమే కాకుండా అర్థవంతం అయినవి కూడా అవ్వడంతో చాలా బాగా కుదిరాయి అనుకోవాలి . దర్శకత్వం విషయమో పూరి ఎప్పటిలానే నిరశపరచలేదు. తనదయిన శైలి టేకింగ్ తో అలరించాడు. కాని దృష్టి మొత్తం ఎన్టీఆర్ పాత్ర మీదనే కాకుండా కాస్త మిగిలిన పాత్రలను కూడా జాగ్రత్తగా అభివృద్ధి చెయ్యల్సింది. చిత్రంలో అంతర్లీనంగా ఫిలాసఫీ నడుస్తుంటుంది కాని తెర మీద కనిపించదు. ఉదాహరణకి రెండవ అర్ధ భాగంలో ఎన్టీఆర్ మరియు పోసాని కి మధ్యలో వచ్చే సన్నివేశాలలో చాలా ఫిలాసఫీ కనపడుతుంది కాని ఇది చిత్రం ఆసాంతం ఉండుంటే చాలా బాగుండేది. శ్యాం కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది కొన్ని పాటలలో చాలా బాగుంది, ఫైట్ సన్నివేశాలలో కెమెరా వర్క్ బాగా తోడ్పడింది, ఫైట్స్ కూడా బాగున్నాయి. అనూప్ రూబెన్స్ పాటల్లో రెండు పాటలు ఆకట్టుకున్నాయి. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సన్నివేశాలను బలపరిచింది. రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలకు నేపధ్య సంగీతం ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ బాగుంది కాని చాలా సన్నివేశాలను ఇంకా పదునుగా కత్తిరించి ఉండాల్సింది. పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటే గుర్తొచ్చేది.. పూరి మార్క్ డిఫరెంట్ కామెడీ విత్ సూపర్బ్ హీరోయిజం ఎలిమెంట్స్. ఈ రెండింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ సినిమాలో పూరి బ్రాండ్ మిస్ అయినట్టే అని చెప్పాలి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పరంగా పూరి ఎన్నడూ లేనంతగా ఫెయిల్ అయ్యాడు. కథా పరంగా ఫస్ట్ హాఫ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టే అవకాశం ఉంది కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఆ ఎంటర్టైన్మెంట్ తుస్సుమంది. కానీ ఒక్క సెకండాఫ్ లో హీరోయిజంని పర్ఫెక్ట్ గా చూపించి ఆడియన్స్ లో సినిమా బాగుంది అనే ఫీలింగ్ ని తెచ్చేసాడు. పూరి లాంటి డైరెక్టర్ ఇలాంటి కథ దొరకడం నా అదృష్టం అని చెప్పాడు కానీ కథలో అంత సీన్ లేదు. దురదృష్టకరంగా ఈ చిత్ర కథ మరియు పటాస్ ఒకేలాగా ఉండటం అంతేకాకుండా వెంటవెంటనే రెండు చిత్రాలు వచ్చేయడం కాస్త దెబ్బ తీసిన విషయమే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని సరికొత్తగా ప్రెజెంట్ చెయ్యడం, తారక్ నటనలో, డైలాగ్ డేలివరీలో చూపిన వైవిధ్యమే ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లోని రొటీన్ కాన్సెప్ట్ మరియు లవ్ ట్రాక్ ని తట్టుకొని కూర్చోగలిగితే సెకండాఫ్ ని బాగా ఎంజాయ్ చెయ్యగలరు. టెంపర్ సినిమా ఓవరాల్ గా ఎన్.టి.ఆర్ అభిమానులకు నూతన ఉత్తేజాన్ని ఇస్తే, మిగిలిన ప్రేక్షకులకు మాత్రం ఒక డీసెంట్ పోలీస్ డ్రామా చూసాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఎన్టీఆర్ అభిమాని అయితే వెంటనే చూడవలసిన చిత్రం సినిమా అభిమాని అయితే ఒకసారి చూడగలిగే చిత్రం ..Jr NTR,Kajal Aggarwal,Puri Jagannadh,Bandla Ganesh,Anoop Rubens.Coming Soon....

మరింత సమాచారం తెలుసుకోండి: