డైరెక్టర్ చెప్పాలనుకున్న సింగల్ పాయింట్ స్టొరీ లైన్ , వెంకటేష్ ప్రసాద్, సుహాసినిలను చూసి మనం సినిమాకి వెళ్ళడం. డైరెక్టర్ చెప్పాలనుకున్న సింగల్ పాయింట్ స్టొరీ లైన్ , వెంకటేష్ ప్రసాద్, సుహాసినిలను చూసి మనం సినిమాకి వెళ్ళడం. స్టొరీ పాయింట్ ని సరిగా డెవలప్ చేయకపోవడం , బోరింగ్ అండ్ లాగింగ్ స్క్రీన్ ప్లే , ఊహాజనితమైన నేరేషన్ , డైరెక్షన్ , ఎడిటింగ్ , సాంగ్స్ , మ్యూజిక్ సచిన్(మాస్టర్ స్నేహిత్) జన్మించడమే మానసిక వైకల్యం (మెంటల్లీ రిటార్టెడ్)తో పుడతాడు. అందువల్ల సచిన్ అంటే కన్న తల్లికి, సచిన్ చిన్న అక్కకి ఇష్టం ఉండదు. కానీ పెద్ద అక్క స్వాతి(సుహాసిని)కి మాత్రం సచిన్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తనే అమ్మై ఎంతో జాగ్రత్తగా సచిన్ ని పెంచుతుంది. అందుకే తను సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అయినా పెళ్లి మాత్రం చేసుకోదు. కానీ తనని ప్రేమించే క్రికెట్ కోచ్ వెంకటేష్ ప్రసాద్(వెంకటేష్ ప్రసాద్) మాత్రం తను పెళ్ళికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఓ రోజు సచిన్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఇక అతను ఎక్కువ రోజులు బతకడని స్వాతికి తెలిసి ఎంతో కుమిలిపోతూ ఉంటుంది. అదే టైంలో సచిన్ వచ్చి తనకు ఆ సిటీలో జరగనున్న స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో క్రికెట్ ఆడాలని ఉందని చెబుతాడు. తన కోరిక ఎలా అయినా నెరవేర్చాలనుకున్న స్వాతి వెంకటేష్ ప్రసాద్ ని హెల్ప్ అడుగుతుంది. స్వాతి అడిగిన దాని కోసం వెంకటేష్ ప్రసాద్ ఏం చేసాడు.? మెంటల్లీ రిటార్టెడ్ అయిన సచిన్ ని జట్టులో చేర్చుకోవడానికి ఏ స్కూల్ అంగీకరించింది.? మెంటల్లీ రిటార్టెడ్ అయిన సచిన్ క్రికెట్ ఎలా ఆడగలిగాడు.? చివరికి సచిన్ కోరిక నెరవేరిందా.? లేదా.? అనే పాయింట్స్ మీరు వెండితెరపైనే చూసి తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాల గురించి పేజీలు పేజీలు రాయడం అనవసరం కాబట్టి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి ఫినిష్ చేసేస్తా.. టైటిల్ రోల్ చేసింది మాస్టర్ స్నేహిత్.. అతను ఒక చైల్డ్ ఆర్టిస్ట్, తనకి యాక్టింగ్ అంటే ఏంటో పెద్దగా తెలియదు కాబట్టి డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తాడు. డైరెక్టర్ రాసుకున్న మెంటల్లీ రిటార్టెడ్ పాత్ర అనేది ఎలా ఉంటదనేది తనకే తెలియకపోవడం వల్ల ఆయనేదో చెప్పాడు స్నేహిత్ ఏదో చేసాడు. దానివల్ల చూసే వాళ్ళకి తలనొప్పి వస్తది వస్తది. ఇక సీనియర్ యాక్టర్ సుహాసిని మణిరత్నం బాగా చేసారు. ఆమెకి ఇచ్చిన రోల్ ని సునాయాసంగా చేసుకొని వెళ్ళిపోయారు. వెంకటేష్ ప్రసాద్ కి యాక్టింగ్ రాదు అందుకే ఆయనకు తగ్గట్టుగా క్రికెట్ కోచ్ పాత్రే ఇచ్చారు. కావున కొన్ని షాట్స్ లో బానే చేసాడు. కానీ ఆన్ స్క్రీన్ ఎమోషన్స్ పలికించడం అంత ఈజీ కాదు అందుకే ఎమోషనల్ సీన్స్ లో ఏంది సార్ మాకిది. మరీ పెర్ఫార్మన్స్ తో ఇలా డిజప్పాయింట్ చేస్తున్నారని అనుకుంటారు. స్కూల్ ప్రిన్సిపల్ గా సుధారాణి పెర్ఫార్మన్స్ డీసెంట్ అనిపిస్తుంది. మిగతా అందరూ తెలుగు వారికి పరిచయం లేనివారే.. ఎవ్వరూ వీరి గురించి చెప్పుకోవాలి అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. కానీ ఒకరున్నారు. వెంకటేష్ ప్రసాద్ కి పోటీగా ఆపోజిట్ కోచ్ గా చేసిన నటుడు. చూడటానికి బలంగా మాంచి దిట్టంగా ఉన్నాడు, సీన్ కి పావలా పెర్ఫార్మన్స్ ఇవ్వమంటే పాతిక రూపాయల పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బాబోయ్ తట్టుకోలేరు.. ఇక నటీనటుల వివరాలు ఇంతటితో సమాప్తం.. ఈ మధ్య కాలంలో కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం కుదిరితే ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా జత చేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపొయింది(ఇలా అన్ని విభాగాలను పర్ఫెక్ట్ గా డీల్ చేసి విజయాలు అందుకున్న వారికి ఇద వర్తించదు). ఇలా ఎందుకు అన్నాను నటే మనం ఆ పని చెయ్యలేం అనే విషయం మనకు చేసే టైంలో కచ్చితంగా తెలిసిపోతుంది. అలాంటప్పుడు దాన్ని వేరొకరికి ఇవ్వడం లేదా వేరే వారి సాయం తీసుకోవడం ఉత్తమం. కానీ మన సినిమా ఇండస్ట్రీలో గొప్పలకు పోయి ఎవరికీ ఇవ్వకుండా, చేజేతులా వారి కెరీర్ ని వారే నాశనం చేసేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇదే పనిని ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అందించిన మోహన్ చేసాడు కాబట్టి.. ఈ సినిమా కోసం ఎంచుకున్న బేసి స్టొరీ లైన్ బాగుంది. అదే మానసిక వైకల్యంతో బాధపడేవారు కూడా మనలో ఒకరే, వారిని మనలో కలుపుకోండి. ఈ పాయింట్ చాలా బాగుంది. కానీ కథ పూర్తి చేసే టప్పటికి అనుకున్న పాయింట్ 30 సార్లు రూటు మారి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వచ్చి చేరింది. ఇక స్క్రీన్ ప్లే అనేది అయితే అబ్బో.. ఒక 20 తెలుగు సినిమాలు చూసిన ఏ 3వ క్లాస్ పిల్లాడైనా చెప్పేయగలడు. అలాంటప్పుడు ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది. అవి రెండూ పోతే తన కథకి ఎలాంటి పెర్ఫార్మన్స్ లు రాబట్టుకోవాలో కూడా తెలియకేపోతే ఈయన్ని ఏమనాలి. సచిన్ సినిమా పరంగా టోటల్ ఫెయిల్యూర్ మోహన్ దే అని బల్ల గుద్ది చెబుతాను. వెంకటేష్ ప్రసాద్ లాంటి క్రికెటర్ ని సినిమాలో పెట్టుకొని, టీంకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బాయ్స్ తో ఎన్ని రకాల ఆసక్తికర సీన్స్, మొటివేశనల్ సీన్స్ తీయచ్చు కానీ అవేమీ లేవు. చివరికి 20 నిమిషాలు పైనే క్లైమాక్స్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ లో కూడా వెంకటేష్ ప్రసాద్ చేత ఓ స్ట్రాంగ్ సీన్ చేయించలేకపోయాడు, ఆ మాత్రం దానికి వెంకటేష్ ప్రసాద్ ఎందుకు ఏ యాక్టర్ అయినా సరిపోద్ది కదా.. ఇకపోతే సచిన్ మెంటల్లీ రిటార్టెడ్ అలాంటి వాడు క్రికెట్ ఎలా ఆడగలుగుతున్నాడు, పలు విషయాలను అంత పర్ఫెక్ట్ గా గుర్తుంచుకున్న వాడు తనకి ఇష్టమైన ఆటలో కొన్ని బేసిక్ విషయాలను ఎలా మర్చిపోతుంటాడు అనే పాయింట్స్ ని కూడా డైరెక్టర్ మిస్ అయ్యాడు. శివ ఎడిటింగ్ బాలేదు. ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. రాజేష్ రామ్ నాథ్ సాంగ్స్ తెలుగులో డబ్ అవ్వడం వల్ల సరిగా లేవు, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరీ లౌడ్ గా, సందర్భానికి మించి ఉన్నట్టు అనిపిస్తుంది. తానికొండ వెంకటేశ్వర్లు డబ్బింగ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మంచి పాయింట్స్ ని, మంచి సినిమాలని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు, విమర్శకులు ఎప్పుడు ముందు ఉంటారు. కానీ మీరు చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా సరిగా చెప్పలేకపోతేనే వారు తీవ్ర నిరుత్సాహానికి గురై, వారి జేబుకు పడిన చిల్లును ఓ సారి గుర్తుకు తెచ్చుకొని సంస్కృతం చదువుతారు. అలాంటి పరిస్థితినే ఈ సినిమా కలిగించుకుంది. సినిమా రిలీజ్ ముందు ఎందరు వచ్చి ప్రమోషన్స్ చేసినా, ఎలా ఉందని చెప్పినా ఫైనల్ రిజల్ట్ చెప్పాల్సింది ప్రేక్షకులే.. అలాంటి ప్రేక్షకులను నిరుత్సాహపరిచే సినిమా ఈ సినిమాలో అనుకున్న పాయింట్ తప్ప ఇంకేదీ బాలేదు. కథ నుంచి పలువురి నటీనటుల చెత్త పెర్ఫార్మన్స్ వరకు. ఓవరాల్ గా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ని ప్రజలకి చెప్పాలని అనుకున్న మోహన్ ని మనసులోనే అభినందించి, ఆ పాయింట్ ని మైండ్ లో పెట్టుకొని ఈ సినిమా ఒకటి ఉంది, దాన్ని చూడాలి అనే ఆలోచనని మరచిపోండి. అది మీ ఆరోగ్యానికి మంచిది, అలాగే మీ జేబులోని ధనలక్ష్మిని కూడా సేవ్ చేసుకున్నవారవుతారు. Venkatesh Prasad,Suhasini Maniratnam,B N Krishna,Thaikonda Venkatesh,Rajesh.పంచ్ లైన్ : సచిన్.. టెండూల్కర్ కాదు - అందుకే ఈ సచిన్ డక్కౌట్.!

మరింత సమాచారం తెలుసుకోండి: