గత కొంత కాలంగా తెలుగు టీవి ఛానల్స్ లో తెగ ఎంటైర్టమ్మెంట్ చేసి వీడియో కి సంబంధించిన ఆధారాలు దొరికాయి. వివరాల్లోకి వెళితే, యు ట్యూబ్ లో టాలీవుడ్ రికార్డ్స్ ని షేక్ చేసిన మగధీర మూవీ డైలాగ్స్ ని గుక్క తిప్పుకోకుండా చెప్పి, అందరిని తెగ అలరిస్తున్న బుడతడిని, రామ్ చరణ్ ఎట్టకేలకు కలుసుకున్నాడు.

కేవలం ఇది యు ట్యూబ్ లోనే కాకుండా, ఫేస్ బుక్ వంటి సోషియల్ సైట్స్ లోనూ ఈ వీడియో అందరిని అలరిస్తుంది. రామ్ చరణ్.. తన రెండో సినిమా మగధీరతోనే చరిత్ర తిరగరాశాడు. ఆ సినిమాలోని “ఒక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు..” అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగులైతే ఆయనకు ట్రేడ్‌ మార్క్ గా నిలిచాయి.

ఇప్పుడవే డైలాగులను ఒక బుడతడు గుక్క తిప్పుకోకుండా చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఆ వీడియోని చూసిన రామ్ చరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ వీడియోని చూడగానే తాను రీచార్జ్ అవుతున్నట్టూ, ప్రతిరోజూ ఆ వీడియో చూడడం ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పాడు.

ఎలాగైన ఆ బుడత మగధీరుడిని కలుసుకోవాలని రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాడంట. ఎట్టకేలకు మగధీర అభిమానిని కలిసానని రామ్ చరణ్ తన సోషల్ సైట్ ద్వారా తెలిపారు. బాల మగధీరుడితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరదా సరదాగా మాట్లాడుతున్న ఫోటో, సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: