రాకేశ్ శ్రీ వాత్సవ్ సినిమాటోగ్రఫీ ,హరి గౌర మ్యూజిక్ , సత్యరాజ్ పెర్ఫార్మన్స్ రాకేశ్ శ్రీ వాత్సవ్ సినిమాటోగ్రఫీ ,హరి గౌర మ్యూజిక్ , సత్యరాజ్ పెర్ఫార్మన్స్ స్లో నేరేషన్ , తెలుగు ఆడియన్స్ కి నచ్చని క్లైమాక్స్ , ఎడిటింగ్ , ఊహాజనితమైన స్క్రీన్ ప్లే , సెకండాఫ్ , నాన్సెన్స్ సప్తగిరి ట్రాక్ , సినిమాలో ఒక్క ఎమోషన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంరాజకీయాలలో నాయకుల కోసం పనిచేసిన అనుచరుల జీవితాలు ఉంటాయన్నదే ఈ సినిమా కథ. ఇక కథలోకి వెళితే.. తాడికొండ - కర్లపూడి గ్రామాలలో ఆ ప్రాంతపు ఎమ్మెల్యేలైన కోట శ్రీనివాస రావు - శివరామకృష్ణ(శివరామకృష్ణ)కి మధ్య పోటీ ఉంటుంది. కోట తరపున త్రిమూర్తులు పనిచేస్తుంటే, శివరామకృష్ణ తరపున రామరాజు(సత్య రాజ్) పని చేస్తుంటాడు. ఓ ఎలక్షన్స్ టైంలో రామరాజు త్రిమూర్తులను చంపేయడం, ఆ తర్వాత శివరామకృష్ణ పార్టీ రూలింగ్ లోకి రావడంతో త్రిమూర్తుల ముగ్గురు కొడుకులు, కోట సైలెంట్ అయిపోయి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. కానీ ఎప్పటికైనా మళ్ళీ అదే ఊరికి వచ్చి రామరాజుని చంపాలన్నదే వారి కోరిక. ఈ టైంలో రామరాజుకి నమ్మకమైన అనుచరుడు శ్రీను(అదిత్ అరుణ్) - రామరాజు కుమార్తె గౌరీ(డింపుల్ చోపడే) మధ్య ప్రేమ పుడుతుంది. ఈ పగల నేపధ్యంలో మొదలైన వీరి ప్రేమ ఏమైంది.? కోట మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచి త్రిమూర్తుల కొడుకులని రంగంలోకి దింపి రామరాజుని చంపాడా.? లేదా.? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. నటీనటుల్లో ముందుగా చెప్పాల్సింది ఈ సినిమాకి హీరో అయిన సత్యరాజ్ గురించే చెప్పాలి.. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ తనే..ఈ సీనియర్ తన మెచ్యూర్ పెర్ఫార్మన్స్ తో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. అనుచరులకు నాయకుడిగా చాలా చక్కని హావభావాలను పలికించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మెసేజ్ ఇచ్చే టైములో పెర్ఫార్మన్స్ సూపర్బ్. ఇక అదిత్ అరుణ్ చేసింది ఏమీ లేదు. చాలా చోట్ల నటనకు ప్రాధాన్యం ఉన్నా సీన్ కి తగ్గస్తాయి పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం దాదాపు ఒకటే ఎక్స్ ప్రెషన్ కనిపిస్తుంది. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ మాత్రం ఓకే. డింపుల్ చోపడే కి పెర్ఫార్మన్స్ పరంగా చేయడానికి పెద్ద స్కోప్ లేదు. కానీ లుక్స్ పరంగా మాత్రం కుర్రకారుకి బాగా గట్టిగా గుచ్చుకుంటుంది. మూవీలో ఉన్న షార్ట్ రొమాటిక్ ట్రాక్ లో డింపుల్ క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ బాగా ఇచ్చింది. హీరో ఫ్రెండ్ గా కనిపించిన జబర్దస్త్ శ్రీను కామెడీ టైమింగ్ మరియు అతనిచ్చిన హావభావాలు ఆడియన్స్ కి రిలీజ్, అంటే ఆ ఎపిసోడ్స్ కాస్త నవ్వుకుంటారు. ధన్ రాజ్, నవీన్ లు కూడా కాసేపు నవ్వించారు. సప్తగిరి చేత అనవసరమైన లేకి కామెడీ చేయించారు. అది నవ్వు తెప్పించకపోగా ఆడియన్స్ ని ఇర్రిటేట్ చేస్తుంది. మిగతా చిన్న చిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు, శివరామకృష్ణ, రవివర్మ, పవిత్ర లోకేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించి కనుమరుగయ్యారు. అసలు డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు అన్నది క్లారిటీ లేదు. మాకు అర్థమైనంతవరకు 'కత్తి పట్టుకున్నవాడు కత్తి పోటుకే' పోతాడు అన్న పాయింట్ ని డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు. కానీ ఇదే కాన్సెప్ట్ ని మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం. సరే చెప్పాలనుకున్న ఓల్డ్ పాయింట్ అయినా ఆసక్తికరంగా చెప్పాడా అంటే అదీ లేదు. స్క్రీన్ ప్లే ని చాలా దారుణంగా రాసుకున్నాడు. ఎందుకంటే సినిమాలో సెకండ్ సీన్ నుంచి మీరేమనుకుంటే అది జరిగిపోతుంటుంది. ఇక చూసే ఆడియన్స్ కి ఆసక్తి ఎందుకుంటుంది సినిమాపై.. సరే ఈ విషయంలో ఫెయిల్ అయినా ఆడియన్స్ కి సినిమాని కనెక్ట్ చెయ్యడానికి ఓ మార్గం ఉంది. అదే సినిమాలోని ఎమోషన్స్, పాత్రల ఫీలింగ్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడం. కానీ ఈ రెండు కూడా డైరెక్టర్ చెయ్యలేదు. ఉదాహరణకి ఇరువర్గాల మధ్య పోరు, హీరో - హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్, సత్యరాజ్ - అదిత్ అరుణ్ రిలేషన్ ఇలా ఏ ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. అది పక్కన పెడితే సినిమాకి మేజర్ కీ పాయింట్ రవివర్మ బావ అయిన సత్యరాజ్ ని కాదని విలన్స్ తో ఎందుకు చేతులు కలిపాడు అన్న కీ పాయింట్ ని కూడా చూపించలేదు. ఇలాంటి ఇల్లాజికల్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఇలా డైరెక్టర్ శ్రీనివసకృష్ణ గోగినేని అన్ని డిపార్ట్ మెంట్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఒక్క డైలాగ్స్ పరంగా మాత్రమే కాస్తో కూస్తో పరవాలేదనిపించుకున్నాడు. డైరెక్టర్ కి ఎప్పుడు చెప్పాలనుకున్న మెసేజ్ ఒక్కటే బాగుంటే సరిపోదు, దాని చుట్టూ అల్లుకునే కథ - కథనం కూడా బాగుండాలని తెలిసినట్టు లేదు. ఏదో కమర్శియాలితీ కోసం సప్తగిరి ట్రాక్ ని యాడ్ చేసారు. డైరెక్టర్ కి ఆ మాత్రం తెలియదా మనం తీస్తున్న కథకి ఈ ట్రాక్ అస్సలు సెట్ అవ్వదు అని, అయినా తీసారు అంటే ప్రేక్షకుల మీద వీరికి పగ ఉందేమో, వాళ్ళని టార్చర్ చేయడానికే తీసారు తప్ప మరోదానికి కాదేమో అనే ఫీలింగ్ వస్తుంది.

టెక్నికల్ డిపార్ట్ మెంట్ టీంలో తమకు ఇచ్చిన పనికి పూర్తి న్యాయం చేసిన వారిలో ప్రధమంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర. ఈ మధ్య కాలంలో మనం మరచిపోతున్న పల్లెటూరి అందాలను రాహుల్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నాచురల్ షాడో షాట్స్ ని బాగా తీసాడు. ఇకపోతే ఈ విజువల్స్ కి హరి గౌర మ్యూజిక్ మరింత ఆకర్షణ అయ్యింది. హరి గౌర కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి, కానీ ఒక్కటి కూడా సదర్భానికి తగ్గట్టు వచ్చినట్టు అనిపించలేదు. విజువల్స్ పరంగా ఏ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. హరి గౌర రీ రికార్డింగ్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా ఇంటెన్స్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు. తమ్మిరాజు ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఆయన తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పి సాగదీసిన సీన్స్ ని కట్ చేసి ఉండాల్సింది. ఆర్ట్ డైరెక్టర్ హరివర్మ వర్క్ డీసెంట్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే. చిన్న సినిమా అయినా కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి, పలుసార్లు రీ షూట్ చేసి తీసినందున వారాహి చలన చిత్రం వారిని మెచ్చుకోవాలి. కానీ ఆడియన్స్ ని మెప్పించే సినిమాని మాత్రం అందించలేకపోయారు. డైరెక్టర్ అనే వాడు రాసుకున్న కథని ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోతే ఆ సినిమా డిజాస్టర్స్ లిస్టు లో చేరిపోయినట్టే.. ఆ లిస్టులో తుంగభద్ర కూడా చేరిపోయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కి మొత్తం భాద్యత ఒక్క శ్రీనివాసకృష్ణ గోగినేనికే చెందుతుంది. ఎందుకంటే ఆయన డీల్ చేసిన అన్ని డిపార్ట్ మెంట్స్ సినిమాకి గండి కొట్టేసాయి కాబట్టి.. కథలో పాయింట్ బాగున్నా దానిరాసుకున్న విధానం నాట్ నాట్ సెంచురీది కాబట్టి స్టొరీ ఫ్లాప్.. కథనం ఏమో పది మంది కలిసి ముందుకు తోసినా కదలని మొండి ఎద్దులా ఎంతకీ ముందుకు సాగదు. స్లోగా సాగడమే కాకుండా మరీ చిన్న పిల్లలు కూడా ఊహించే విధంగా సాగడం సినిమాకి మరో పెద్ద మైనస్. దానికి తోడూ కథనంలో లెక్కలేనన్ని లొసుగులు, క్లారిటీ లేని పాత్రల తీరుతెన్నులు, అస్సలు ముగింపు లేని క్లైమాక్స్ ఆడియన్స్ ని చిరాకు పెడుతుంది. ఇకపోతే డైరెక్టర్ గా ఒక్క ఎమోషన్ ని కూడా కనెక్ట్ చేయలేకపోతే ఆడియన్స్ రెండు గంటలు ఎలా కూర్చుంటారు. దానికి తోడు సందర్భం లేని పాటలు, నాన్సెన్స్ అనిపించే సొల్లు కామెడీ ఇంకా ఇర్రిటేట్ చేస్తాయి. ఈ తప్పుల వాళ్ళ డైరెక్టర్ తన పరువు తానూ తీసుకోవడమే కాకుండా సత్యరాజ్ లాంటి నటుడు కనబరిచిన మంచి నటనని, సాయి కోరపతి బ్యానర్ కి ఉన్న పరువుని నాశనం చేసాడు. నాకు తెలిసి సినిమా థియేటర్ కి వెళ్లి చూడాల్సిన కంటెంట్ ఈ సినిమాలో లేదు. అందుకే టీవీలో వచ్చేంతవరకూ వెయిట్ చేయండి.Adith Arun,Dimple Chopde,Srinivas Gogineni,Sai Korrapati,Hari Gaura.పంచ్ లైన్ : తుంగభద్ర - అదే 'తుంగభద్ర'లో కలిపేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: