ఏదైన ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిందంటే, ఆ మూవీ కోసం ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలు అంతా రిమేక్ చేయటం కోసం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ మూవీ విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుంది.

ఇక వివరాల్లోకి వెళితే, మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో వచ్చి,ఘన విజయం సాధించిన చిత్రం ‘కత్తి’. ఈ మూవీ తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2014 అక్టోబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో రిమేక్ అవుతుందంటూ తెగ టాక్స్ వినిపించాయి.

అయితే ఇప్పటి వరకూ అది సాధ్యపడలేదు. కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని క్లియర్ టాక్స్ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ కత్తి మూవీ రిమేక్ కోసం సరైన హీరో సిద్ధంగా లేడు.

తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్, రవితేజ లాంటి ఓ పది మంది పెద్ద హీరోలకి ఈ కత్తి మూవీని తెలుగులో కొద్ది మార్పులు చేసి కథని వినిపించారంట. అయితే ఈ పది మంది హీరోలలో ఏ ఒక్కరూ ఇందులో నటించటానికి యాక్సెప్ట్ చేయలేదంట. ఫైనల్ గా కత్తి మూవీ రిమేక్ లో ఎవ్వరు నటిస్తారు అన్నది ఇప్పుడు ఓ ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: