'ఈ రోజుల్లో' వంటి చిన్న సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ మారుతికి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉన్నట్టే కనిపిస్తోంది. తాజాగా మారుతికి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్స్ట్ బ్యానర్ లో అల్లు అరవింద్ మారుతికి ఓ ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. 'ఈ రోజుల్లో' హిట్ కావడంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అవకాశం ఇవ్వడంతో 'బస్ స్టాప్' అనే సినిమాను తెరకెక్కించాడు. 'బస్ స్టాప్' ఆదివారం విడుదల చేస్తున్నాడు. రెండో సినిమా విడుదలకు ముందే అల్లు అరవింద్ ఛాన్స్ ఇవ్వడంతో మారుతికి ఎక్కడ లేని ఉత్సాహంతో ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ ఆండ్ క్రూను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం విడుదలవుతున్న 'బస్ స్టాప్' కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే మారుతి కెరీర్ కు తిరుగులేకుండా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: